Chris Gayle-Signed Golden Bat Bowls Over Amitabh Bachchan

Chris gayle gifts his bat to legend amitabh bachchan

ICC T20 World Cup, West Indies Cricket, Chris Gayle, Bollywood Megastar, Amitabh Bachchan, banglore royal challengers, bollywood news, cricket news, spartan bat, bollywood big b, Cricket

Crickets King of Bling provided the opening shot in the tweet-exchange. A thrilled Big B promptly told Chris Gayle that he was equally a fan. The Jamaican-born West Indian cricketer, who is known for his extravagant lifestyle, became the first man in world cricket to use a willow of that colour in 2015

మెగాస్టార్‌కి బ్యాట్ గిప్ట్.. అభిమానం చాటుకున్న గేల్.!

Posted: 02/27/2016 04:54 PM IST
Chris gayle gifts his bat to legend amitabh bachchan

తన బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడే విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ అభిమానం చాటుకున్నాడు. తన అభిమానంతో బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ను క్లీన్‌బోల్డ్‌ చేశాడు. భారతీయ సినిమాను ప్రపంచంలో పెద్దగా ఎవరు చూస్తారులే అనుకుంటున్న సమయంలో ఈ వెస్టిండిస్ క్రికెటర్ తనకు పెద్ద ఫ్యాన్ అని తెలియడం విస్మయంలో ముంచెత్తిందని బిగ్‌ బీ అమితాబ్ తెలిపారు. తన అభిమానానికి గుర్తుగా క్రిస్‌ గేల్ తన సంతకం చేసిన బ్యాటును కానుకగా ఇచ్చాడని, ఈ అభిమానం తనకెంతో ఆనందం కలిగించిందని ఉబ్బితబ్బిబ్బవుతూ బిగ్‌ బీ చెప్పారు.

'మిస్టర్ క్రిస్‌ గేల్‌. ఇది నిజంగా గొప్ప గౌరవం. నువ్వు నన్ను గుర్తుపట్టగలవని నేనెప్పుడూ అనుకోలేదు. నిజంగా ఎంతో ముగ్ధుడినయ్యాను. మేమంతా నీ వీరాభిమానులం. హిందీ సినిమాల అభిమాని క్రిస్‌ గేల్ తన సంతకంతో ఉన్న గోల్డెన్ బ్యాటును నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇది నాకు దైవసందేశంతో సమానం' అని బిగ్ బీ ట్విట్టర్‌లో తెలిపారు. ఐపీఎల్‌లో వీరబాదుడు బాదే క్రిస్‌ గేల్‌ తనకు బాలీవుడ్ షెహన్‌షా అంటే ఎనలేని అభిమానమని ట్విట్టర్‌లో తెలిపాడు. 'లెజండ్ అమితాబ్ బచ్చన్‌కు నా స్పార్టన్ బ్యాటును బహుమానంగా ఇవ్వడం గర్వంగా ఉంది. ఆయన సినిమాలు, స్టైల్‌ను ఎంతోగానో అభిమానిస్తా. థాంక్యూ' అంటూ క్రిస్‌ గేల్ ట్వీట్‌ చేశాడు. ఇందుకు ప్రతిగా అమితాబ్‌ కూడా ట్విట్టర్‌లో స్పందించడంతో 'త్వరలోనే భారత్‌లో కలుద్దాం' అంటూ బిగ్‌ బీకి గేల్‌ మరో మెసేజ్ చేశాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan  chris gayle  big b  spartan bat  

Other Articles