Rohit Sharma in record-breaking spree, joins elite list

Rohit sharma creates new record against australia

india vs australia, india vs aus, ind vs aus, australia vs india, aus vs india, india vs australia highlights, india cricket team, rohit sharma, rohit sharma india, cricket india, cricket

Rohit Sharma is only the third batsman after Grame Hick and VVS Laxman to hit back-to-back hundreds against Australia in Australia.

అసీస్ గడ్డపై 4 శతకాలతో రోహిత్ రికార్డు

Posted: 01/15/2016 10:00 PM IST
Rohit sharma creates new record against australia

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్నరెండో వన్డేలో సెంచరీ చేసిన రోహిత్..  ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు శతకాలు చేసిన భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. గత పెర్త్ వన్డేలో భారీ సెంచరీ చేసి భారత మాజీ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ సరసన నిలిచిన రోహిత్.. ఈ తాజా సెంచరీతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
 
దీంతో పాటు గబ్బా స్టేడియంలో అత్యధిక స్కోరు చేసిన భారత ఓపెనర్ గా నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ ఈ స్టేడియంలో ఓపెనర్ గా చేసిన 91 పరుగుల రికార్డును రోహిత్ సవరించాడు.  ఓవరాల్ గా రోహిత్ కెరీర్ లో ఇది 10 వన్డే సెంచరీ కాగా, ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై ఐదో సెంచరీ. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో వరుసగా రెండో సెంచరీ చేయడంతో వీవీఎస్, గ్రేమ్ హిక్ ల సరసన రోహిత్ నిలిచాడు.  ఆస్ట్రేలియాపై 20 ఇన్నింగ్స్ లను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ సుమారు 95. 00 ఉండగా,  అతని సగటు దాదాపు 68.00కు పైగా ఉండటం విశేషం.  ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ వన్డే అత్యధిక స్కోరు 209.  

* ఆస్ట్రేలియాపై  20 ఇన్నింగ్స్ లలో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అంతకుముందు సచిన్, బ్రియాన్ లారాలు ఆ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు.

* గబ్బా స్టేడియంలో రోహిత్-విరాట్ల నెలకొల్పిన 125 పరుగుల భాగస్వామ్యం మూడో అత్యుత్తుమం.

* అంతకుముందు ఇదే స్టేడియంలో ఆస్ట్రేలియాపై టీమిండియా అత్యుత్తమ స్కోరు 303/4.  ఆ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.

* గతంలో ఇదే స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నాలుగుసార్లు 300 పైగా పరుగులు చేసి విజయం సాధించగా,  ఒకసారి మాత్రం 301 పరుగులను ఛేజింగ్ చేసి విజయం నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Gabba  new record  Rohit sharma  vvs lakshman  

Other Articles