India | Australia | Gabba | one day international | Rohit sharma

Another rohit ton another australia win

india vs australia, india vs aus, ind vs aus, australia vs india, aus vs india, india vs australia highlights, india cricket team, rohit sharma, rohit sharma india, cricket india, cricket

India had given big target to the hosts, but Australian batsmen settled down to comfortable win as bowlers lag to take wickets

రోహిత్ మరో సెంచరీ.. ఆగని నెట్ జనుల విమర్శలు

Posted: 01/15/2016 09:57 PM IST
Another rohit ton another australia win

టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో విమర్శలను ఎదుర్కున్నాడు. నెట్ జనులు విరాట్ చెత్త ఆటపై సైటర్లు నానా రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఈ సారి అస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో రోహిత్ శర్మ రెండు మ్యాచ్ లలో రెండు సెంచరీలను సాధించినా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేంటీ చెత్త ప్రదర్శన చేస్తే కదా విమర్శలు విసరాల్సింది. అద్భుతంగా రాణించినా.. రోహిత్ శర్మ విమర్శల పాలు కావడమేంటి..? అనేగా మీ డౌట్..

తొలి వన్డేలో సెంచరీ చేసినా పరాజయం పాలైన సందర్భంగా, మళ్లీ రెండో వన్డేలో కూడా శతకం బాదినా.. ఇండియా ఓటమిపాలవ్వడంతో సోషల్ మీడియాలో రోహిత్ పై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ సెంచరీ చేస్తే టీమిండియా ఓటమి ఖాయమని నెటిజన్లు పేర్కొన్నాడు. మూడనమ్మకాలు, సెంటిమెంట్లకు మేం దూరం అంటూనే.. నెట్ జనులు రోహిత్ పై విమర్శలను సందిస్తున్నారు. ఎవరైనా తనకు వచ్చిన అటను సరిగ్గా ఆడకపోతే విమర్శలపాలవుతారు కానీ రోహిత్ మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కోంటున్నాడు.

దీనిపై రోహిత్ మాట్లాడుతూ, ఎంత భారీ స్కోరు చేసినప్పటికీ జట్టు ఓటమిపాలైతే బాధేస్తుందని తెలిపాడు. రికార్డుల కోసం తాము ఆడడం లేదని, జట్టు విజయం కోసం ఆడుతామని, ఎంత బాగా ఆడినా జట్టు పరాజయం పాలైతే సాధించిన ఘనతను ఆస్వాదించలేమని చెప్పాడు. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు బాధించినప్పటికీ, వాటిలో వాస్తవముందని రోహిత్ శర్మ తెలిపాడు. అయితే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగడమే ప్రతి ఆటగాడి ముందున్న కర్తవ్యమని రోహిత్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Gabba  one day international  Rohit sharma  

Other Articles