Dhoni said that people will beat him

Dhoni said that people will beat him

MS Dhoni, Hair Style, Dhoni Hair Style, Starsports, World Cup T20

The Word T20 (WT20) 2016 is just a couple of months away and Star Sports, the official broadcaster of the tournament, has released a promotional video featuring none other than India’s limited-overs captain MS Dhoni

రోడ్ల మీదకు వెళితే కొడతారు అంటున్న ధోనీ

Posted: 01/07/2016 06:17 PM IST
Dhoni said that people will beat him

ధోనీ అంటే ఒకటి క్రికెట్ లో అతడు కొట్టే హెలికాప్టర్ షాట్... రెండు అతడి హెయిర్ స్టైల్ గుర్తుకు వస్తుంది. అయితే ధోనీ తాను కూడా బోరింగ్ గా తయారవుతున్నానని.. అందుకే కొత్త లుక్ లో కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. 2016 టీ20 ప్రపంచ కప్ లో కొత్త లుక్ లో ధోనీ కనిపించడనున్నారా అంటే అవును అనే అంటారు అయితే తాజాగా విడుదలైన యాడ్ లో ధోనీ స్టైల్స్, అతడు చేసిన వ్యాఖ్యలు వార్తల్లో నిలిచాయి.

2016 టీ20 ప్రపంచ కప్ కోసం ధోనీతో ఓ ప్రకటన చేసింది స్టార్ స్పోర్ట్స్. రాబోయే టీ20 ప్రపంచకప్‌ కోసం రూపొందించిన ఈ కొత్త యాడ్  ఆసక్తి రేపుతోంది. ‘జీవా(ధోనీ కూతురు) పుట్టాక నేను బోరింగ్‌గా తయారయ్యానని (విరాట్) కోహ్లీ, జడ్డూ(రవీంద్ర జడేజా) అంటున్నారు' అన్న ధోనీ మాటలతో మొదలవుతుంది ఈ ప్రకటన. ఆ తర్వాత ధోనీ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ సప్నా భవ్నానీ అతడి దగ్గరికొచ్చి.. రకరకాల జుట్టు నమూనాలు చూపిస్తుంది. ప్రపంచకప్‌లో ధోని ఎలాంటి హెయిర్ స్టైల్ తో బరిలోకి దిగాలనే విషయంలో ఇద్దరి మధ్య చర్చ నడుస్తుంది. మలింగ తరహా కేశాలంకరణతో ధోనీ ఉన్న చిత్రం చూపించగానే.. ‘మరి మలింగ ఏం చేస్తాడు' అంటాడు ధోనీ.

మరికొన్ని విచిత్రమైన నమూనాలు చూపిస్తే.. ‘ఇలా రోడ్ల మీదికి వెళ్తే జనాలు రాళ్లతో కొడతారు' అంటూ ధోనీ అసహనం వ్యక్తం చేస్తాడు. చివరగా 2007లో ప్రపంచకప్‌ గెలిచినప్పటి మహి జులపాల జుట్టును ప్రయత్నిద్దామా అంటుంది సప్నా. కాగా, ఇది ప్రపంచకప్‌ వచ్చేస్తోందంటూ అభిమానుల్లో ఉత్సాహం తెచ్చేందుకు తయారు చేసిన ప్రకటన. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, భారత్‌ ఆతిథ్యమిచ్చే ఈ టీ20 ప్రపంచకప్‌ మార్చి 8-ఏప్రిల్‌ 3 తేదీల మధ్య జరుగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  Hair Style  Dhoni Hair Style  Starsports  World Cup T20  

Other Articles