Chris Gayle to sue Fairfax Media over claims he exposed himself

Chris gayle to sue fairfax media over claims he exposed himself

Chris Gayle , Fairfax Media, sue, Cricket World Cup, lawyer Mark O’Brien

Chris Gayle has said he will sue Fairfax Media for defamation after it published allegations he exposed himself to a woman while in Sydney to train for the 2015 Cricket World Cup. The 36-year-old West Indies player issued a statement on Thursday saying he had retained media lawyer Mark O’Brien and would “immediately commence defamation proceedings against Fairfax Media”.

పరువు నష్టందావా వెయ్యనున్న క్రిస్ గేల్

Posted: 01/07/2016 04:16 PM IST
Chris gayle to sue fairfax media over claims he exposed himself

యాంకర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చచేసిన క్రిస్ గేల్ పరువునష్టం దావా వెయ్యడానికి సిద్దమవుతున్నారు. అయితే గేల్ ఆ యాంకర్ కు సంబందించిన వివాదంలో కాకుండా వేరే అంశంలో ఈ దావా వేస్తుండటం విశేషం. అయితే రిపోర్టర్ తో క్రిస్ గేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత గత వరల్డ్ కప్ సందర్భంగా వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీలో ఆస్ట్రేలియా మహిళతో క్రిస్‌ గేల్ అసభ్యకరంగా వ్యవహరించాడని ఫెయిర్‌ఫాక్స్‌ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ విషయంలో ఫెయిర్‌ఫాక్స్‌పై దావా వేసేందుకు ఆయన ఓ ప్రముఖ ఆస్ట్రేలియన్ లాయర్‌ సేవలను కోరారు.

బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనగేడ్స్ జట్టు తరఫున ఆడుతున్న క్రిస్‌ గేల్‌ ట్వంటీ-20 మ్యాచ్ అనంతరం మహిళా ప్రజెంటర్‌తో అసభ్యంగా మాట్లాడి పీకల్లోతు వివాదాల్లోకి కూరుకుపోయాడు. ప్రత్యక్ష ప్రసారంలో టెన్‌స్పోర్ట్స్ ప్రజెంటర్ మెల్‌ మెక్‌లాలిన్‌ను తనతో తాగేందుకు బయటకు వస్తావా? అని అడుగడం తీవ్ర దుమారం రేపింది. దీంతో రెనగేడ్స్  జట్టు గేల్‌పై 10వేల డాలర్ల జరిమానా విధించింది. ఈ వివాదం ముగియకముందే ఓ ఆస్ట్రేలియా మహిళ ముందుకొచ్చి వరల్డ్‌ కప్ సందర్భంగా తనను గేల్‌ లైంగికంగా వేధించాడని ఫెయిర్ ఫాక్స్ న్యూస్ వెల్లడించడం జరిగింది. అయితే క్రిస్ గేల్ మీద వచ్చిన తాజాగా వివాదం మరింత ఇరకాటంలో పడేసింది. ఫెయిర్‌ఫాక్స్ మీడియాలో ప్రసారమైన ఈ కథనాన్ని గేల్‌ మేనేజర్‌ సిమన్ అతూరి తీవ్రంగా ఖండించారు. ఫెయిర్‌ఫాక్స్‌ గేల్‌పై అసత్య ప్రచారాలు అందుకే దానిపై పరువునష్టం దావా వేసేందుకు ప్రముఖ లాయర్‌ మార్క్ ఒబ్రియన్‌ను గేల్‌ నియమించుకున్నట్టు సిమన్ ఓ ప్రకటనలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles