Lovebirds Anushka Sharma-Virat Kohli take off for their New Years vacation

Virat kohli anushka sharma spotted together again

anushka sharma,virat kohli,indian star,indian star batsman rohit sharma, Lovebirds Anushka Sharma-Virat Kohli, kohli and anushka spotted together, Bollywood, Anushka Sharma, Indian cricketer, Virat Kohli, Mumbai airport

he chemistry between India’s limited-overs skipper Virat Kohli and renowned Bollywood actress Anushka Sharma is no more a secret affair.

ఔను.. వాళ్లిద్దరూ ఎగిరిపోయారు.. విదేశాలకు

Posted: 12/29/2015 04:52 PM IST
Virat kohli anushka sharma spotted together again

తొలినాళ్లలో తమ ప్రేమను రహస్యంగా దాచి.. వాళ్లిద్దరూ కలసిన ప్రతీసారి కూడా రహస్యంగానే. అయితే  పెద్దలు అంగీకారం, నిశ్చయ తాంబూలాలు తీసుకోవడంతో.. ఇక తమకు ఎదురేంటనుకున్నారో.. జరగాల్సిందంతా ఏడాది ప్రారంభంలోనే ప్రపంచ కప్ లో జరిగిపోయిందనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఇక మీడియాకు తాము జంకాల్సిన అవసరమూ లేదు.. అనుకున్న జంట ఏకంగా మరోమారు కెమెరాలకు చిక్కింది. అ జంట ఎవరో తెలుసా..? టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ. ఈ జోడి మధ్య కెమిస్ట్రీ మంచి రంజుగా సాగుతున్న క్రమంలో ఇద్దరు కలసి నూతన సంవత్సరం శుభగడియాలను స్వాగతించేందుకు విదేశీ విహారానికి బయలుదేరి వెళ్లారు.

ఈ జంట బ్యాగు, సూట్‌కేసు సర్దుకొని ముంబై ఎయిర్‌పోర్టులో దనర్శమిచ్చింది. ఇక ఆలస్యమెందుకనుకున్న మీడియా.. వెంటనే కెమెరా క్లిక్ లకు పనిచెప్పింది. అంతే వార్త దావణంలో వ్యాపించింది. అయితేనేం అనుకున్న లవ్ బర్డ్స్ మాత్రం నింపాదిగా ప్లయిట్ ఎక్కి ఎగిరిపోయారు. నిన్నమొన్నటివరకు ఇటు క్రికెట్‌ మ్యాచులు, అటు సినిమా షుటింగ్‌లతో కోహ్లి, అనుష్క బిజీబిజీగా గడిపారు. కొత్త సంవత్సరం రానున్న సందర్భంగా ఈ బిజీ షెడ్యూళ్ల నుంచి ఇద్దరికీ కాసింత తీరిక దొరకడంతో జంటగా విదేశాల్లో విహరించడానికి.. వీరు బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తున్నది. అయితే వారు ఏ దేశానికి వెళ్లిందనేది తెలియకపోయినా.. విదేశాల్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోబోతున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Anushka Sharma  Indian cricketer  Virat Kohli  Mumbai airport  

Other Articles