భారత్ తో జరగాల్సిన ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఇక ముగిసిన అధ్యాయంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. ఇండో పాక్ సిరీస్ పై బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యాన్ ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెలలో బిసిసిఐ డిమాండ్ మేరకు శ్రీలంకలో జరగాల్సిన సిరీస్ పై బిసిసిఐ ఇంకా నాన్చివేత ధోరణిలోనే వ్యవహరిస్తుండటంతో ఇక ఈ సిరీస్ ముగిసిన అధ్యాయంగా అభివర్ణించారు. ఇంకా ఆ సిరీస్ పై తమకు ఎంతో కొంత ఆశలు ఉన్నప్పటికీ దానిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తాజాగా స్పష్టం చేశారు.
గత గురువారం భారత్-పాక్ ల క్రికెట్ సిరీస్ పై బీసీసిఐకి షహర్యార్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఒకవేళ ఇరు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ జరగని పక్షంలో.. వచ్చే ఏడాది భారత్ లో జరిగే ట్వంటీ20 వరల్డ్ కప్ ను తమ జట్టు బాయ్ కాట్ చేస్తుందని ఆ లేఖలో హెచ్చరించారు. అయితే ఇప్పటివరకూ బీసీసీఐ దానిపై ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించకపోవడంతో షహర్యార్ సోమవారం మరోసారి మీడియా ముందుకొచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఆ సిరీస్ పై ఆశగా ఎదురు చూశాం. బీసీసీఐ నుంచి ముందడుగు పడలేదు. గడిచిన శనివారం సాయంత్రంతోనే ఆ చాప్టర్ ముగిసిపోయింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) దృష్టికి తీసుకువెళ్లడమే మా ముందున్న మార్గం' అని షహర్యార్ అన్నారు.
భారత్-పాకిస్థాన్ ల మధ్య ఈనెలలో యూఏఈలో ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలు చూపుతూ యూఏఈలో ఆడటానికి భారత్ అంగీకరించలేదు. ఆ సిరీస్ ను భారత్ లో ఆడాలని పీసీబీకి విజ్ఞప్తి చేసింది బీసీసీఐ. దీన్ని పాకిస్థాన్ తిరస్కరించడంతో ఇరు దేశాల బోర్డు పెద్దల మధ్య దుబాయ్ లో చర్చలు అనివార్యమయ్యాయి. ఈ చర్చల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ ను శ్రీలంక నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ పెద్దలు మధ్య ఒప్పందం కుదిరింది. కాగా శ్రీలంకలో ఆడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సమ్మతించినా.. భారత్ ప్రభుత్వం మాత్రం సానుకూలత వ్యక్తం చేయలేదు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. గత సంవత్సరం కుదిరిన ఎంఓయూ ప్రకారం 2015 నుంచి 2023 వరకూ ఇరు దేశాల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు జరగాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more