MS Dhoni among iconic cricketers to play for new teams in IPL 2016

Mahendra singh dhoni to be highlight at ipl reverse auction

ms dhoni, dhoni, mahendra singh dhoni, ms dhoni ipl, chennai super kings, csk, indian premier league, ipl tender, indian premier league tender, cricket news, cricket, dhoni news, ipl news

The team which submits the lowest bid will have the first right to pick the player of their choice.

ఐపీఎల్ రివర్స్ వేలంలో ధోణి ఎటువైపు..

Posted: 12/08/2015 06:06 PM IST
Mahendra singh dhoni to be highlight at ipl reverse auction

వచ్చే సంవత్సరం జరిగే ఐపీఎల్ సీజన్ లోకి ప్రవేశించే రెండు కొత్త ఫ్రాంచైజీల పేర్లు పూణే, రాజ్ కోట్ లు బిసిసిఐ ప్రకటించింది.. బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనల ప్రకారం, అతి తక్కువ బిడ్డింగ్ వేసి ఫ్రాంచైజీని పొందేవారు దిగ్గజ ఆటగాళ్ల నుంచి తమకు నచ్చిన వారిని తొలుత ఎంపిక చేసుకోవచ్చు. ఈ రివర్స్ వేలం నిబంధనే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. గత సంవత్సరం టోర్నమెంటు తరువాత సుప్రీం ఆదేశాల మేరకు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీములపై వేటు పడటంతో కొత్తగా వచ్చే జట్టు వీరిని ఎంపిక చేసుకునే అవకాశం వుంది.

దీంతో ఇవాళ ఖారారైన రెండు ఫ్రాంచైజీల ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు హాట్ ఫేవరెట్. తక్కువ బిడ్ దాఖలు చేసిన ఫ్రాంచైజీ తన తొలి ప్లేయర్ పిక్ లో ధోనీని లాగేసుకునే ఛాన్స్ పొందుతుంది. ధోనీ ఉంటే, బ్రాండింగ్ తో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చన్నది ఫ్రాంచైజీల భావన. ఇక ధోనీని ఎవరు తమ టీంలోకి చేర్చుకుంటారన్నది వేచి చూడాల్సిందే. కాగా, రాజ్ కోట్ జట్టు తక్కువగా బిడ్ చేసిన నేపథ్యంలో ఆ జట్టు తరపున ధోని అడే అవకాశాలున్నాయని సమాచారం. ఐపీఎల్ ఆటగాళ్ల వేలం 15వ తేదీన జరుగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  IPL  lowest bidder  new rules  

Other Articles