Virender Sehwag forgets to mention MS Dhoni in thank you speech

Virender sehwag felicitated thanks all captains except ms dhoni

india, ms dhoni, virender sehwag, virender sehwag retirement, virender sehwag retires, virender sehwag BCCI, virender sehwag felicitation, Virender Sehwag skips MS Dhoni, sehwag thank you speech

Sehwag has been blunt and straightforward about his axing from the team, as he expressed the sorrow of not getting a retirement match.

బిసిసిఐ సన్మానంలో కెప్టన్ ధోని పేరును మరచిన సెహ్వాగ్

Posted: 12/03/2015 07:01 PM IST
Virender sehwag felicitated thanks all captains except ms dhoni

టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మంట్ ప్రకటించగానే స్పందించి ట్విట్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్, వన్డే, టీ-20 జట్టు కెస్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని ఆయన విస్మరించాడు. ధోని నేతృత్వంలోనే అధిక కాలం పాటు టీమిండియాకు సేవలందించిన వీరూ.. దోని పేరును కావాలనే విస్మరించాడా..? లేక హడావిడిలో మర్చిపోయాడా..? అన్నది స్పష్టం కాలేదు.

దేశరాజధాని ఢిల్లీ వేదికగా గాంధీ-మండేలా టెస్టు సిరీస్ లో భాగంగా దక్షిణాప్రికా భారత్ ల జరుగుతున్న నాల్గవ, చివరిదైన మ్యాచ్ ను పురస్కరించుకుని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన నాటి డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి బిసిసిఐ ఘనంగా సన్మానించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే సెహ్వాగ్ ను సన్మానించింది బిసిసిఐ. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కుటుంబసభ్యలతో కలసి వీరేంద్ర సెహ్వాగ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కామెంటేర్ హర్ష బోగ్లే సెహ్వాగ్ తో ముచ్చటించగా, ఆయన తన రోల్ మోడల్ సచిన్ టెండుల్కర్ అని కొనియాడారు. అంతేకాదు తన కోసం ఒపెనింగ్ స్థానాన్ని కూడా వదిలేసిన సౌరవ్ గంగూలీని కూడా కోనియాడాడు. కొద్ది రోజులు మాత్రమే టీమిండియాకు కెప్టెన్ గా సేవలందించిన అనిల్ కుంబ్లే పేరును కూడా ప్రస్తావించిన వీరూ.. దోణి పేరును మాత్రం చెప్పలేదు. తాను టీమిండియాలో చేరిన తొలినాళ్ల కెప్టెన్ అజయ్ జెడేజాను కూడా గుర్తు పెట్టుకుని మరీ ధన్యవాదాలు చెప్పిన సెహ్వాగ్.. ధోని పేరును కూడా ప్రస్తావించలేదు. తన కెరీర్ అభివృద్ధికి సహకరించిన రాహుల్ ద్రావిడ్ తో పాటు తన కెప్టెన్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపాడు. వారందరికీ రుణపడి ఉంటానని సెహ్వాగ్ తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virender Sehwag  MS Dhoni  Bcci  Thank you speech  

Other Articles