MS Dhoni to participate in Executive Golf Invitational at USA

India captain ms dhoni to play golf in us

Phoenician Golf Club, India, MS Dhoni, USA, Golf, Team india captain golf, Executive Golf Invitational, Mahendra Singh Dhoni, MSD golf

Mahendra Singh Dhoni will participate in a two-day Executive Golf Invitational event to be held at the Phoenician Golf Club in USA from December 5.

గోల్పర్ గా మారిన టీమిండియా కెప్టెన్ ధోని

Posted: 12/03/2015 07:00 PM IST
India captain ms dhoni to play golf in us

కెప్టెన్ కూల్ గా క్రికెట్ వర్గాలు ముద్దుగా పిలుచుకునే టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫుట్ బాల్ క్రీడ అంటే మహా ఇష్టం. సమయం చిక్కినప్పుడల్లా అతడు ఫుట్ బాల్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. కొత్తగా అతడు గోల్ఫర్ అవతారం కూడా ఎత్తనున్నాడు. మరి క్రికెట్ మాటేమిటనేగా మీ డౌటు? క్రికెట్ కు అప్పుడప్పుడే వీడ్కోలు పలకడులెండి.

ఇక గోల్ఫర్ గానూ ప్రొఫెషనల్ గా ఏమీ ధోనీ మారడం లేదు కూడా. దేశ రక్షణ కోసం పోరాడిన, గాయపడిన భారత, అమెరికా సైనికుల సంక్షేమార్థం నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ గోల్ఫ్ ఇన్విటేషనల్ ఈవెంట్ లో మాత్రమే అతడు ఆ క్రీడ ఆడనున్నాడు. ధోనీ స్వచ్ఛంద సేవా సంస్థ ‘విన్నింగ్ వేస్’ కూడా ఈ ఈవెంట్ లో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. శనివారం నుంచి అమెరికాలో రెండు రోజుల పాటు ఈ ఈవెంట్ జరగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  MS Dhoni  USA  Golf  Phoenician Golf Club  

Other Articles