team india won first test against south africa

India beat south africa by 108 runs in mohali

cricket score, live score, score live, ind vs sa, ind vs sa live, ind vs sa score, india vs south africa live score, live score india vs south africa, india south africa 1st test, ind vs sa 1st test live, 1st test live score, live latest score, india, india vs south africa 2015, india vs south africa livescore, mohali, r ashwin, south africa, virat kohli latest score, cricket news

India beat South Africa inside three days in Mohali Test to go 1-0 up in the four-match series.

మొహాలీలో మెరిసిన టీమిండియా.. 3 రోజుల్లో మ్యాచ్ ను ముగించిన స్పిన్నర్లు..

Posted: 11/07/2015 05:09 PM IST
India beat south africa by 108 runs in mohali

దక్షాణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి రోజున అధిపత్యం కొనసాగించిన సపారీలపై రెండవ రోజు టీమిండియా పైచేయిని సాధించింది. మూడవ రోజున ఏకంగా మ్యాచ్ ఫలితాన్ని రాబట్టింది. మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లో భాగంగా నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో అధిపత్యాన్ని కోహ్లీ సేన సాధించింది. మ్యాచ్ లో ఆద్యంతం స్పిన్నర్లే హావాను కొనసాగించారు.

దక్షిణాఫ్రికాతో సాగిన టీ-20, వన్డే సిరీస్ లో ఓటమిపాలైన టీమిండియా టెస్టుల్లో అయినా గెలుస్తుందా? అన్న అనుమానాలను పటాపంచలు చేసిన కోహ్లీ సేన తొలి టెస్టులో అద్భుతంగా రాణించి విజయాన్ని నమోదు చేసుకుంది.. భారత జట్టు 108 పరుగుల భారీ ఆధిక్యంతో అతిథ్యజట్టు సఫారీలపై విజయం సాధించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రాణించడంతో తొలి టెస్టులో టీమిండియా తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం 201 పరుగులకే అలౌట్ అయింది. అనంతం తొలి ఇన్నింగ్స్ ఆడిన సఫారీలు కేవలం 184 పరుగులకే పెవిలియన్ చేరి, భారత్ కు 17 పరుగుల ఆధిక్యం ఇచ్చారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు టాప్ ఆర్డర్ రాణించడంతో అత్యంత క్లిష్టమైన పిచ్ పై 200 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సఫారీలను భారత స్పిన్నర్లు తిప్పేశారు. కేవలం 109 పరుగులకే సౌతాఫ్రికాను ఆలౌట్ చేసి సత్తా చాటారు. సఫారీ బ్యాట్స్ మన్ లో కేవలం ముగ్గురు ఆటగాళ్లే రెండంకెల స్కోరు చేయగలిగారు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లతో రాణించగా, రెండో ఇన్నింగ్స్ లో ఆ ఫీట్ ను రవీంద్ర జడేజా సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా 3 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 3 వికెట్లు తీయడం విశేషం. దీంతో రెండో ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ ను దారుణంగా దెబ్బతీసిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles