warne warriors beats sachin blasters by 6 wickets

All stars t20 shane warne s warriors beat sachin blasters

sachin tendulkar, sachin tendulkar shane warne, shane warne, sachin tendulkar, cricket all stars, cricket news, cricket

Set a target of 141, the Warriors romped home with 16 balls to spare after Ricky Ponting and Kumar Sangakkara hit 81 runs between them

అల్ స్టార్స్ లీగ్: తొలి మ్యాచ్ లో బాస్టర్స్ ను బాదిన వారియర్స్

Posted: 11/08/2015 07:50 PM IST
All stars t20 shane warne s warriors beat sachin blasters

క్రికెట్ ఆల్ స్టార్స్ సిరిస్ లో భాగంగా జరిగిన తొలి టి20లో సచిన్ బ్లాస్టర్స్ పై వార్న్ వారియర్స్  విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది.  టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన సచిన్ సేన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెలరేగాడు.  22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 55 పరుగులు బాదాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో బ్లాస్టర్స్ భారీ స్కోరు చేయలేకపోయింది. టెండూల్కర్  26, జయవర్ధనే 18, హూపర్ 11, పొలాక్ 11 పరుగులు చేశారు.

మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. వీవీఎస్ లక్ష్మణ్ 8 పరుగులు చేశాడు. వార్న్ 3, సైమండ్స్ 3 వికెట్లు పడగొట్టారు. వార్న్ బౌలింగ్ లోనే సచిన్ అవుట్ కావడం విశేషం. రికీ పాంటింగ్(48), సంగక్కర(41), జాంటీ రోడ్స్(20) రాణిచండంతో వారియర్స్ విజయం సాధించింది. 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. 16 బంతులు మిగులుండగానే టార్గెట్ ను చేరుకుంది. బాస్టర్ బౌలర్ షోయబ్ అక్తర్ 2 వికెట్లు పడగొట్టాడు. మురళీ ధరన్ ఒక వికెట్ తీశాడు. షేన్ వార్న్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Blasters  Warne Warriors  cricket all star series  

Other Articles