Pakistan beat England to reach 2nd in Test rankings; England drop to 6th

Pakistan jumps to second slot in icc test rankings

icc test rankings, south africa tops icc test rankings, pakistan top second in test rankings, england, zimbamwe, bangaldesh, india, new zealand, australia, srilanka, west indies, cricket score, live score, score live, ind vs sa, ind vs sa live, Pakistan vs England 2015, Pakistan Cricket,England Cricket, Alastair Cook,Joe Root,Yasir Shah, india vs south africa livescore, mohali, r ashwin, south africa, virat kohli latest score, cricket news

Pakistan defeated England by 127 runs in the third and final Test to win the three-match series 2-0 and hence go up to 2nd position in the ICC Test Rankings.

ఐసీసీ టెస్టు ర్యాకింగ్ లో ఎగబాకిన పాక్

Posted: 11/05/2015 08:26 PM IST
Pakistan jumps to second slot in icc test rankings

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ లో 2-0తో విజయాన్ని నమోదు చేసుకున్న పాకిస్థాన్ తాజాగా ప్రకటటిచిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తమ స్థానాన్ని మెరుగుపర్చుకుంది. రెండు స్థానాలు ఎగబాకి తాజాగా ప్రకటించిన ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. దీంతో టీమిండియా ఒక స్థానం ఎగబాకి నాల్గవ స్థానానికి చేరుకుంది. గురువారం షార్జాలో ముగిసిన మూడో టెస్టులో మిస్బావుల్ హక్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఇంగ్లాండ్ జట్టుపై 127 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంతో 4వ స్థానంలో ఉన్న పాక్, 2 స్థానాలు ఎగబాకి అంతర్జాతీయ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ద్వితీయ స్థానానికి చేరుకుంది. అలస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ మూడో స్థానం నుంచి ఏకంగా 6వ స్థానానికి పడిపోయింది.

2006 తర్వాత పాకిస్థాన్ ద్వితీయ స్థానం రావడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో పాకిస్థాన్ 5 పాయింట్లు సాధించగా(101 నుంచి 106కు), సిరీస్ ఓటమి పాలైన ఇంగ్లాండ్ 3 పాయింట్లు చేజార్చుకుని 102 నుంచి 99 పాయింట్లకు పడిపోయింది. కాగా, ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 4 టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో రాణిస్తే భారత ర్యాంకు మరిత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఒకవేళ భారత్ టెస్ట్ సిరీస్‌ను 4-0తో గెలిస్తే ద్వితీయ స్థానానికి ఎగబాకే అవకాశం ఉంటుంది.

జట్టు            రేటింగ్ పాయింట్స్
1. దక్షిణాఫ్రికా        125  
2. పాకిస్థాన్          106
3. ఆస్ట్రేలియా         106
4. ఇండియా          100
5. న్యూజిలాండ్        99
6. ఇంగ్లాండ్           99
7. శ్రీలంక              93
8. వెస్టిండీస్           76
9. బంగ్లాదేశ్          47
10. జింబాబ్వే           5

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc test rankings  south africa  pakistan  India  Asutralia  

Other Articles