Indian bowling attack lacks depth

Indian bowling attack lacks depth

Shoaib Akhtar, Team India, Dhoni, Ravichandran Ashwin, South Africa, mandela Gandhi series, Cricket, Indian Cricket

Former Pakistan fast bowler Shoaib Akhtar has criticised the Indian bowling attack terming it as an unit that "lacks depth" as the only wicket-taking bowler is offspinner Ravichandran Ashwin.

ఇండియన్ ప్లేయర్లది చెత్త బౌలింగ్: షోయబ్ అక్తర్

Posted: 10/06/2015 04:28 PM IST
Indian bowling attack lacks depth

ఆటంటే ఎప్పుడూ ఒకరిదే గెలుపు కాదు.. ఖచ్చితంగా గెలుపోటములు ఉంటాయి. అయితే తాజాగా టీమిండియా ఆడుతున్న సౌతాఫ్రికా నెల్సన్ మండేలా గాంధీ సిరీస్ టీమిండియా చెత్త ప్రదర్శన అందరికి కోపం తెప్పించింది. ఏకంగా టీమిండియా అభిమానులు తమ ఆగ్రహాన్ని క్రికెట్ మైదానం మీద చూపించారు. క్రికెట్ స్టేడియంలోకి బాటిళ్లు విసిరి తమ నిరసన తెలిపారు. అయితే టీమిండియా క్రికెటర్లలో ఎవరూ తమ సత్తా చాటకపోవడం పెద్ద దెబ్బ తీసింది. అయితే టీమిండియా పర్ఫామెన్స్ మీద పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అసలు టీమిండియా బౌలర్లు చెత్త బౌలింగ్ వేశారని.. ఎవరూ కూడా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ లను అడ్డుకోలేకపోయారని అన్నారు. అలాగే అశ్విన్ తప్ప ఏ ఒక్క బౌలర్ తన బెటర్ పర్ఫామెన్స్ చూపించలేకపోయారని అన్నారు.

మ్యాచ్ కు మహ్మద్ షమి ఫిట్ కాలేకపోవడం.. ఉమేష్ యాదవ్ సెలెక్ట్ కాకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని పాకిస్థాన్ సూపర్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నారు. రాబోయే మ్యాచుల్లోనైనా టీమిండియా తన స్ట్రాటజీని మారుస్తుందని అనుకుంటున్నట్లు షోయబ్ అన్నారు. ధోనీ తన కెప్టెన్సీని మరోసారి సరి చూసుకోవాలని సూచించారు. అంబటి రాయుడి ప్లేస్ ను అజరింకా రహానే భర్తీ చేయాలని కూడా షోయబ్  సలహా ఇచ్చారు. అయితే టీమిండియా అభిమానుల ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకుంటానని కానీ అలా తమ ఆటగాళ్లు బాగా ఆడలేదని మైదానంలోకి బాటిల్స్ విసరడం మంచిది కాదు అని అన్నారు. ఈ తరహా సంఘటనలు క్రికెట్ కు చెడు పేరు తీసుకువస్తాయని కూడా అన్నారు. మొత్తంగా టీమిండియాలో కొన్ని లోటుపాట్లున్నా కానీ ఖచ్చితంగా బెటర్ గా  ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles