Mahendra Singh Dhoni has been summoned by a court in Anantapur | Dhoni hurting the sentiments of Hindus | Dhoni Crime News

Anantapur court summons mahendra singh dhoni hurting sentiments hindus

ms dhoni news, anantapur court summons ms dhoni, ms dhoni latest updates, ms dhoni controversies, ms dhoni vishnu avatar, vishnu avatar ms dhoni, business today magazine, ms dhoni matches, the god of the big deals ms dhoni

Anantapur Court Summons Mahendra Singh Dhoni Hurting Sentiments Hindus : Mahendra Singh Dhoni has been summoned by a court in Anantapur in connection with a case filed against him for allegedly hurting the sentiments of Hindus.

ధోనీకి సమన్లు జారీ చేసిన కోర్టు..హాజరు కావాలని ఆదేశం..

Posted: 10/05/2015 06:49 PM IST
Anantapur court summons mahendra singh dhoni hurting sentiments hindus

టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఇటీవల కాలం అంతగా కలిసి రావడం లేదని అనిపిస్తోంది. ఇప్పటికే ఇతని కెప్టెన్సీ సరిగ్గా లేదని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీకి తాజాగా మరో షాక్ తగిలింది. అనంతపురం కోర్టు ఇతనికి సమన్లు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇంతకీ ధోనీకి ఏ విషయంలో కోర్టు సమన్లు జారీ చేసింది? అని సందేహిస్తున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

‘ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్’ శీర్షికతో బిజినెస్ టుడే తమ మేగజైన్ కవర్ పై ధోనికి విష్ణువు రూపంలో ప్రచురించిన చిత్రం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే! ఆ సంస్థ తమ మేగజైన్ ను వినూత్నంగా ప్రచారం చేస్తూ.. ధోనీని విష్ణుమూర్తి అవతారంలో చూపిస్తూ.. అతని చేతుల్లో షూ సహా పలు వస్తువులను పెట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమత్.. ఆ చిత్రం హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ ధోనీపై, ప్రచురణకర్తపై, సంపాదకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా, ధోనీపై క్రిమినల్ కేసు నమోదైంది. అదే సమయంలో అనంతపురంలోనూ.. ధోనీ వేషధారణ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వుందని విశ్వాహిందూ పరిషత్ (వీ.హెచ్.పీ) పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన కోర్టు.. తాజాగా సమన్లు జారీ చేసింది. నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

ఇదిలావుండగా.. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాల్సిందిగా ధోనీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసును విచారించిన ధర్మాసనం స్టే ఆర్డర్ ఇచ్చి ధోనీకి ఊరటనిచ్చింది. తొలుత కర్ణాటక హైకోర్టు విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు అనంతపురం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ధోనీ ఆ న్యాయస్థానానికి హాజరవుతాడో? లేదో? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni summons  anantapur court summons ms dhoni  dhoni vishnu avatar  

Other Articles