Virat Kohli defends five-bowler strategy, blames batsmen for defeat

We have to blame ourselves for loss skipper kohli

virat kohli, responce, galle test, ind vs srl 2015, virat kohli on galle test, virat kohli responce on 1st test defeat, team india test captain virat kohli virat on galle test defeat

India skipper Virat Kohli today stoutly defended his five-bowler strategy, saying the blame lies with the batsmen who failed to deliver while chasing 176 odd runs in the first cricket Test.

బ్యాట్స్ మెన్లదే బాధ్యత.. బాగానే అడాం కానీ..

Posted: 08/15/2015 05:54 PM IST
We have to blame ourselves for loss skipper kohli

శ్రీలంకతో తొలిటెస్టులో ఓటమి పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్ను తప్పుపట్టారు. ఓటమికి తమదే బాధ్యతని అన్నాడు. మాథ్యూస్ సేన అద్భుతంగా ఆడిందని కోహ్లీ ప్రశంసించాడు.  లంక రెండో ఇన్నింగ్స్లో ఆరంభంలోనే ఐదు వికెట్లు పడగొట్టాం. మ్యాచ్లో అప్పటికి మేమే మెరుగైన స్థితిలో ఉన్నాం. ఆ తర్వాత పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం. టెస్టు క్రికెట్ అంటే ఇలాగే ఉంటుందని అన్నాడు. కేవలం ఒక్క బ్యాడ్ సెషన్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పుకొచ్చాడు.
 
శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఐదు వికెట్లను పడగొట్టిన తర్వాత పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయామని కోహ్లీ అంగీకరించాడు. రంగన హెరాత్ అద్భుతమైన బౌలర్ అని, ఒత్తిడిలోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆటకట్టించాడని గుర్తు చేశారు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌ను గెలవడం మామూలు విషయం కాదని, ఆ ఘనత ఏంజెలో మాథ్యూస్‌కు, అతని జట్టుకు చెందుతుందని అన్నాడు. ఓటమికి ఏ ఒక్కరినో నిందించలేమని, ఈ వైఫల్యం అందరిదీ అని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  responce  galle test  ind vs srl 2015  

Other Articles