Herath 7/48 Gives Hosts An Amazing 63-Run Victory

India just did not have batting strength to win galle test

India vs Sri Lanka, India, India in Sri Lanka 2015, Sports, Sri Lanka, Virat Kohli, Ravichandran ashwin, amit mishra, Harbhajan Singh, cricket, srilanka tour, ind vs srl, ind vs sri 2015, srilanka, India, India Vs Sri Lanka Live live cricket, Live Cricket Score, Test Cricket Live, Angelo Mathews, Kumar Sangakkara, Galle, cricket news

Dinesh Chandimal's brilliant knock has proven to be the difference in this Test match. His knock helped Sri Lanka rise back and Rangana Herath's 7/48, his 22nd five-wicket haul has ensured that Sri Lanka have won a remarkable match by 63 runs.

హెరాత్ మహాద్బుతం.. మోకరిల్లిన కోహ్లీ సేన

Posted: 08/15/2015 04:12 PM IST
India just did not have batting strength to win galle test

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతం జరిగింది. తొలి ఇన్నింగ్స్ లో ఇరగదీసిన కోహ్లీ సేన..  రెండో ఇన్నింగ్స్ కు వచ్చే సరికి వరుసగా పెవీలియన్ కు దారిపట్టారు. శ్రీలంకను వరించిన అదృష్టం అద్భుతం చేయడంతో ఇన్నింగ్ విజయం ఖాయమనుకున్న తరుణంలో చండీమాల్ అద్బుత ఇన్నింగ్ దానిని దూరం చేశాయి. రెండు రోజులు మిగిలి వుండటం, తొలి ఇన్నింగ్స్ లో బాగా రాణించడంతో.. స్వల్ప స్కోరు లక్ష్యంగా బరిలో దిగిన కోహ్లీ సేన అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. నాల్గవ రోజు లంక బౌలర్ హేరత్ తనకు అనుకూలంగా మార్చుకుని భారత్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 63 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. లంకేయులు విసిరిన 176 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా  వరుస వికెట్లను కోల్పోయి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  టీమిండియా 112 పరుగులకే చాపచుట్టేయడంతో తొలి టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది.  దీంతో కోహ్లీ నేతృత్వంలోని తొలి లంక పర్యటన పేలవంగా ఆరంభమైంది.

టీమిండియా ఆటగాళ్లలో అజింక్యా రహానే (36 ) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. టీమిండియా 23 /1 ఓవర్ నైట్ స్కోరు తో  ఈరోజు ఆటను ప్రారంభించింది.  శుక్రవారం కేఎల్ రాహుల్ (5) ను తొలి వికెట్ రూపంలో కోల్పోయిన టీమిండియా . శనివారం  నైట్ వాచ్ మన్ ఇషాంత్ శర్మ(10) వికెట్ ను ఆదిలోనే చేజార్చుకుంది.  ఇషాంత్ శర్మ వికెట్ కోల్పోయే సరికి టీమిండియా స్కోరు 30/2. అయితే ఆ తరువాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. టీమిండియా 67 పరుగులకే ఏడు వికెట్లు నష్టపోయి ఒక్కసారిగా కష్టాల్లో పడింది. టీమిండియా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(28), రోహిత్ శర్మ(4), విరాట్ కోహ్లీ(3), సాహా(2), హర్భజన్ సింగ్(1),అశ్విన్ (3), అమిత్ మిశ్రా(15) లు పెవిలియన్ కు చేరడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ ఏడు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించగా.. కౌశల్ మూడు వికెట్లు తీసి లంక విజయంలో సహకరించాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 367 పరుగులు సాధించింది. టీమిండియా తోలి ఇన్నింగ్స్ లో 375మ పరుగులు సాధించగా, రెండో ఇన్నింగ్స్ లో 112 పరుగులకే అలౌట్ అయ్యి ఓటమిపాలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srilanka  India  ind vs sri  india vs srilanka 2015  ist test  

Other Articles