Unhappy Dhoni may refuse Jharkhand govt's Swachh Bharat Abhiyan offer

Dhoni may refuse swachh bharat abhiyan offer

Dhoni may refuse Jharkhand goverment's offer, Mahendra Singh Dhoni Jharkhand government Swachh Bharat brand ambassador, MS dhoni, swach barat, PM modi, amerendra pratap singh Ranchi, cricket academy, brand ambassador

India’s ODI captain Mahendra Singh Dhoni could turn down the Jharkhand government’s offer to become the state brand ambassador for the Swachh Bharat Abhiyan apparently because he is unhappy over how such public campaigns are handled, according to one of his family members and a close friend.

సదావకాశాన్ని జారువిడుచుకోనున్న ధోని

Posted: 07/03/2015 05:18 PM IST
Dhoni may refuse swachh bharat abhiyan offer

మహేంద్ర సింగ్ ధోని.. పాకిస్థాన్ తో వన్డే మ్యాచ్ తో జుంపాల జుట్టుతో వచ్చి ఆదరగోట్టిన ఆటగాడు. క్రికెట్ ప్రపంచానికి అప్పటి వరకు తెలియని హెలికాప్టర్ షాట్ ను పరిచయం చేసిన ధోని.. మిస్టర్ కూల్ కెప్టెన్ గా సహచర క్రికెటర్ల మనస్సును గెలిచన ధోని.. గత కొంత కాలంగా చాలా నిరుత్సాహంగా, నిస్తేజంగా కనిపిస్తున్నారు. నైరాశ్యంలోకి జారుకుంటున్న ధోని తనను వెతుకుంటూ వచ్చిన సదవకాశాన్ని కూడా జారవిడుచుకుంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి జార్ఖండ్ ప్రచారకర్తగా ఉండాలని ఆ రాష్ట్ర తాగునీరు, పారిశుధ్ద్య శాఖ కార్యదర్శి అమరేంద్ర ప్రతాప్ సింగ్ గత నెలలో కారారట. అయితే తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పిన ధోని.. ఇప్పుడు ఆ అవకాశాన్ని తిరస్కరించాలనుకుంటున్నారట. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఒకరు మీడియాతో సూచనప్రాయంగా వెల్లడించారట.

మిస్టర్ కూల్ కెప్టెన్ ఇలా ఎందుకు చేస్తున్నాడు.. ఇలాంటి నిర్ణయాలను ఎందుకు తీసుకుంటున్నారని అలోచిస్తే.. ఆయన కుటుంబ సభ్యుల నుంచి సమాధానం కూడా వస్తుందట. అదేంటంటారా..? ఇప్పటికే జార్ఖండ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ, ఫల్స్ పో లియో, అక్షరాస్యత తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున ధోని ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయా కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని, దీంతో ఆయా పధకాలకు లభిస్తున్న ఆగరణ కూడా అంతంతమాత్రమేనని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఉన్నవాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన తరువాత మరో కార్యక్రమానికి ప్రచారం చేస్తానని ధోని నిర్మోహమాటంగానే చెప్పాలనుకుంటున్నాడని కుటుంబసభ్యలు అంటున్నారు. కాగా, రాంచీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం కూడా ఈ నిర్ణయానికి ఒక కారణం కావచ్చునని కూడా తెలుస్తోంది

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles