I am fully committed to Bengal: Pragyan Ojha

Could not turn down sourav ganguly s offer pragyan ojha

could not turn down Sourav Ganguly's offer: Pragyan Ojha, Pragyan Ojha, Sourav Ganguly, Sachin Tendulkar, Ranji Trophy, Cricket, Bengal, Cheteshwar Pujara

Left-arm spinner Pragyan Ojha was approached by Sourav Ganguly to turn out for Bengal for the upcoming domestic season, an offer that was so exciting that the India discard had to seek an emotional move from Hyderabad.

గంగూలీ ఆఫర్ ను కాదనలేకపోయాను: ఓజా

Posted: 07/02/2015 09:19 PM IST
Could not turn down sourav ganguly s offer pragyan ojha

బౌలింగ్ యాక్షన్ పై వివాదం చెలరేగడంతో.. టీమిండియా జట్టు నుంచి ఉద్వాసనకు గురైన లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా.. తాజా దేశవాలీ సీజన్ కోసం సన్నధమయ్యాడు. ఇప్పటి వరకు హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఓజా ఇకపై బెంగాల్ జట్టుకు ఆడనున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బిసిసిఐ అడ్వజరీ కమిటీ సభ్యుడిగా కోనసాగుతున్న సౌరవ్ గంగూలి తనకు ఇచ్చిన అవకాశాన్ని కాదనలేకపోతున్నానని చెప్పాడు. అదేంటి అనుకుంటున్నారా..?

తనకు అనుకోకుండా ఓ రోజు గంగూలి నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్నాడు. బెంగాల్ టీమ్ కు ఆడమని గంగూలీ తనను కోరాడని చెప్పుకోచ్చాడు. ఏకంగా గంగూలీ తనకు ఈ ఆఫర్ ను పిలిచి ఇవ్వడంతో ఆపర్ ను అందుకోవాలనుకున్నానని, దానిని తిరస్కరించలేకపోయానని చెప్పాడు. తాను జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన నేపథ్యంలో మంచి జట్టు తరుపున ఆడడం కూడా ముఖ్యమన్న విషయం గుర్తించానని చెప్పాడు. బెంగాల్ జట్టుతో కాంట్రాక్టు కుదర్చుకున్నానని.. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా సిద్దంగా వుందని ప్రజ్ఞాన్ ఓజా తెలిపాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pragyan Ojha  Sourav Ganguly  Cricket  Bengal  

Other Articles