Suresh Raina Supports MS Dhoni Over Loss series with Bangladesh | Virat Kohli | Team India

Suresh raina supports ms dhoni over loss series with bangladesh

Suresh Raina, Suresh Raina news, Suresh Raina latest updates, Suresh Raina photos, Suresh Raina dhoni, ms dhoni, ms dhoni controversy, team india, virat kohli, Suresh Raina support dhoni, dhoni with suresh raina

Suresh Raina Supports MS Dhoni Over Loss series with Bangladesh : Middle-order batsman Suresh Raina has come out in full support of Mahendra Singh Dhoni, saying the beleaguered Indian skipper and his achievements "can't be shown disrespect" and that he still has a lot of cricket left in him.

ఒక్క సిరీస్ తోనే ధోనీ చెడ్డవాడయ్యాడా?

Posted: 06/25/2015 03:06 PM IST
Suresh raina supports ms dhoni over loss series with bangladesh

బంగ్లా టూర్ లో భాగంగా టీమిండియా జట్టు పేలవ పెర్ఫార్మెన్స్ తో బంగ్లదేశ్ చేతిలో చిత్తుగా సిరీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే! మూడు వన్డే మ్యాచుల ఈ సిరీస్ ని బంగ్లా జట్టు 2-1 విజయంతో కైవసం చేసుకుంది. అయితే.. బంగ్లా చేతిలో టీమిండియా ఇలా ఓడిపోవడంతో కెప్టెన్ ధోనీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ధోనీ సరిగ్గా నాయకత్వ బాధ్యతలు వహించకపోవడం వల్లే టీమిండియా సిరీస్ ని చేజార్చుకుందని కొందరు క్రికెట్ ప్రముఖులు విమర్శలు చేశారు. ఇక టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ కోహ్లీ సైతం ధోనీపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు కురిపించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన టీమిండియా ఆల్ రౌండర్ రైనా.. ధోనీకి మద్దతుగా నిలిచాడు.

ధోనీ మీద వెల్లువెత్తుతున్న విమర్శలపై రైనా విరుచుకుపడుతూ.. ‘ఒక్క సిరీస్ ఓడితేనే ధోనీ చెడ్డవాడయ్యాడా? అతడెవరో ఒకసారి గతం గుర్తుకు తెచ్చుకోండి. టీమిండియాకు అతడు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అతడు సాధించిన విజయాలను చూసైనా అతనిని విమర్శించకూడదు. అతడు ఒక విజయవంతమైన కెప్టెన్.. మానవత్వమున్న నాయకుడు.. నిజాయితీ కలవాడు. ఒకే ఒక్క సిరీస్ ఓడితేనే అతడిని చెడ్డవాడిగా నిర్ధారించలేము. మా అందరికీ అతడంటే ఎంతో ఇష్టమే’ అని రైనా పేర్కొన్నాడు. ఇక ఇతనిలాగే మరికొంతమంది సీనియర్ ఆటగాళ్లు ధోనీకి మద్దతుగా నిలిచారు. టీమిండియా ఓడిపోవడానికి ధోనీ ఒక్కడినే కారకుడ్ని చేయడం కరెక్ట్ కాదని వారు తెలిపారు. సోషల్ మీడియాలో సైతం ధోనీకి మద్దతుగా అతని అభిమానులు నిలిచారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suresh Raina  ms dhoni  virat kohli  

Other Articles