Virat Kohli Sensational Comments reveals the difference between him and Mahendra Singh Dhoni | Team India

Virat kohli sensational comments about mahendra singh dhoni leadership

virat kohli, mahendra singh dhoni, virat kohli news, virat kohli updates, virat kohli controversy, virat kohli latest interview, mahendra singh dhoni controversy, dhoni leadership, kohli dhoni news, dhoni kohli differences, team india players, india vs bangladesh

Virat Kohli Sensational Comments About Mahendra Singh Dhoni Leadership : Virat Kohli Latest Interview reveals the difference between him and Mahendra Singh Dhoni. He said that Players unable to express themselves, dodgy decisions cost India.

విభేదాల మంటను మరింతగా రగిల్చిన కోహ్లీ

Posted: 06/25/2015 02:31 PM IST
Virat kohli sensational comments about mahendra singh dhoni leadership

టీమిండియా జట్టులో నాయకత్వ విభేదాలు వున్నాయంటూ గతకొన్నాళ్ల నుంచి మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరేలా తాజాగా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. జట్టులో వున్న నాయకత్వ మంటలను ఇతగాడు తన కామెంట్లతో మరింత రగిల్చేశాడు. ఇంతకి ఇతగాడు ఏమన్నాడు? అనేగా మీ సందేహం.. ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

బంగ్లా టూర్ లో టీమిండియా ఘోరంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే! పసికూనగా కొనసాగుతున్న బంగ్లా చేతిలో.. ప్రపంచ హావ్ పేవరేట్ అయిన టీమిండియా జట్టు ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇక ఇండయా అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా ప్రతినిధి ఈ ఓటమికి గల కారణాలేంటో చెప్పాల్సిందిగా కోహ్లీని ప్రశ్నిస్తే.. అతగాడు తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘డ్రెస్సింగ్ రూంలో నెలకొన్న సమస్యల కారణంగా సరైన నిర్ణయాలు తీసుకోలేక ఓడిపోయాం’ అని చెప్పాడు. ఈ విధంగా అతగాడు చేసిన వ్యాఖ్యలు కేవలం జట్టులోనే కాక ఇటు క్రీడాభిమానుల్లోకూ అలజడి రేపాయి.

ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా కోహ్లీ మాట్లాడుతూ.. ‘డ్రెస్సింగ్ రూంలో నెలకొన్న కొన్ని సమస్యల కారణంగా మా ఆలోచనల్లో స్పష్టత లేకుండా పోయింది. దీంతో మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాం. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎంతో ఊగిసలాట నెలకొంది. అదే మైదానంలోనూ కనిపించింది. ఈ విషయాన్ని నేను చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారనే విషయాన్ని క్రికెట్ ను పరిశీలిస్తున్న నిపుణుల నుంచి సాధారణ అభిమానుల వరకు ఆ విషయాన్ని గమనించగలరు. స్పష్టమైన వ్యూహాలు లేనిపక్షంలోనే మొదటి రెండు వన్డేలు ఓడిపోయాం’ అని అన్నాడు.

కోహ్లీ ఈ విధంగా పేర్కొన్న ఈ మాటలను గమనిస్తుంటే.. ధోనీకి, ఇతనికి మధ్యనున్న పొరపొచ్చాలు మళ్లీ రగిలాయని తెలిసిపోతోంది. తన ప్రసంగంలో ధోనీ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ.. మొత్తం సారాంశంలో మాత్రం అతని పేరే కనిపిస్తోంది. దీంతో.. వీరి మధ్య విభేదాలు వున్నట్లుగా వస్తున్న వార్తలు కోహ్లీ వ్యాఖ్యలతో స్పష్టం అవుతున్నాయని చెప్పకనే చెప్పొచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  mahendra singh dhoni  team india  

Other Articles