Mahendra Singh Dhoni Fined For Colliding with Bangladesh's Mustafizur Rahman | Cricket Controversies

Mahendra singh dhoni fined for colliding with mustafizur rahman

mahendra singh dhoni, bangladesh cricket match, Mustafizur Rahman, Dhoni Mustafizur Rahman, Dhoni fined, mahendra singh dhoni updates, Mustafizur Rahman updates, Mustafizur Rahman debut match

Mahendra Singh Dhoni Fined For Colliding with Mustafizur Rahman : Mahendra Singh Dhoni was charged with Level 2 offence under ICC Code of Conduct for elbowing Bangladesh's debutant pacer Mustafizur Rahman while chasing an imposing 308-run target at the Sher-e-Bangla stadium.

బంగ్లా బౌలర్ ని ఢీకొట్టినందుకు ధోనీకి భారీ కోత

Posted: 06/19/2015 04:40 PM IST
Mahendra singh dhoni fined for colliding with mustafizur rahman

టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మిర్పూర్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ మ్యాచులో ధోనీ సేన 79 పరుగుల తేడాతో బంగ్లా చేతిలో భారీ ఓటమిని చవి చూసింది. ఈ విషయం కాస్త పక్కనపెడితే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కూల్ కెప్టెన్ ధోనీ ఈ మ్యాచులో కాస్త ఓవర్ గా ప్రవర్తించాడు. సమయానుకూలంగా ఆలోచించి కూల్ నిర్ణయాలు తీసుకునే ఈ డ్యూడ్.. ఈసారి తొందరపాటుతో తప్పటడుగు వేశాడు. ఇతని తప్పటడుగు దెబ్బతో దెబ్బతో బంగ్లా యువ బౌలర్ మైదానమే వీడాల్సి వచ్చింది. అంతే! ధోనీకి భారీ కోత పడింది.

వివరాల్లోకి వెళ్తే.. ఈ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ టాపార్డర్ పూర్తిగా విఫలమయ్యారు. ఒక్కొక్కరు పవెలియన్ కు చేరుతుండగా.. ధోనీ వంతొచ్చింది. జట్టును గెలిపేందుకు అతగాడు రంగంలోకి దిగిన ఇతగాడు పూర్తిగా విఫలమయ్యాడు. కాగా.. ఇన్నింగ్స్ 25వ ఓవర్ రెండో బంతికి ధోనీ పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ ధోనీకి అడ్డుగా వచ్చాడు. మనోడు చాలా బలిష్టంగా వున్నాడు కాబట్టి.. తనదారికి అడ్డుగా వచ్చిన ఈ కుర్ర బౌలర్ ని ధోనీ నిర్దాక్షిణ్యంగా నెట్టివేశాడు. దాంతో కెరీర్లోనే తొలి వన్డే ఆడుతున్న ఆ పేసర్ గాయపడి మైదానం వీడాల్సి వచ్చింది.

ఈ ఘటనపై విచారణ జరిపిన ఐసీసీ టీమ్.. ధోనీ లెవల్-2 నేరానికి పాల్పడినట్టేనని అభిప్రాయపడింది. ధోనీ కావాలనే బౌలర్ ను మోచేత్తో గట్టిగా పొడిచాడనే భావనకు వచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 75 శాతాన్ని ఫైన్ గా విధించింది. కాగా.. ఈ కేసులో టీమ్ మేనేజర్ విశ్వరూప్ దేవ్ తో కలిసి విచారణకు హాజరైన ధోనీ తాను తప్పు చేసినట్లు అంగీకరించలేదని తెలిసింది. ఉద్దేశపూర్వకంగా ఆటగాడిని గాయపరచాలని తాను భావించలేదని ధోని వాదించినట్లు సమాచారం! అయితే.. గాయపడ్డ రెహమాన్ మాత్రం ‘ఆ సమయంలో నేనో తప్పు చేశాను’ అని అంగీకరించినట్లు బంగ్లా పత్రికల్లో వార్తలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mustafizur Rahman  mahendra singh dhoni  india vs bangladesh  

Other Articles