england will be weaker without kevin pietersen says michael clarke

England weaker without kevin pietersen says clarke

Australia captain Michael Clarke, clarke, Englang captain kevin petersen, petersen, Australia, England , England weaker without Kevin Pietersen, england team tough job, Ashes. England and Wales Cricket Board director Andrew Strauss, australia england cricket series 2015

Australia captain Michael Clarke believes England will be weaker without Kevin Pietersen this summer - but expects his side to have a tough job on their hands if they are to retain the Ashes.

పీటర్సన్ లేకపోవడం మాకు కలసివచ్చే అంశమే..

Posted: 05/18/2015 05:58 PM IST
England weaker without kevin pietersen says clarke

జూలై 8 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సీరిస్ లో ఆ జట్టు కీలక సభ్యుడు కెవిన్ పీటర్సన్ ఆడకపోవడం తమకు కలిసొస్తుందని ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్ లో జరగనున్న యాషెస్ సీరీస్ తో గతం మాదిరిగానే ఈ సారి కూడా తాము విజయకేతనం ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 2013-14 యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ ఇదే తీరును అవలంభించి 5-0 తేడాతో ఓటమి పాలైన సంగతిని క్లార్క్ గుర్తు చేశాడు. ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్ లేకపోవడం కచ్చితంగా ఆసీస్ కు కలిసొస్తుందన్నాడు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో పరాజయం పాలైన ఇంగ్లండ్ .. యాషెస్ లో కూడా అదే పరాభావం ఎదుర్కొంటుందని జోస్యం చెప్పాడు.

పీటర్సన్ మంచి ఆటగాడని కితాబిచ్చిన క్లార్క్ .. అతని ఆటతీరు నిజంగా అద్భుతంగా ఉంటుందన్నాడు. పీటర్సన్ ను తిరిగి ఇంగ్లండ్ జట్టులోకి రావాలని కోరుకుంటున్నట్లు క్లార్క్ తెలిపాడు. 2013లో స్ట్రాస్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా పీటర్సన్... స్ట్రాస్ గురించి ప్రత్యర్థి క్రికెటర్లకు సందేశాలు పంపించాడు. దీంతో అతణ్ని జట్టు నుంచి బహిష్కరణకు గురైయ్యాడు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ పీటర్సన్ తన ఫామ్ చాటుకుంటూ జట్టులో చోటు సంపాదించడం కోసం యత్నిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టలోకి రావడానికి ఐపీఎల్ ను సైతం వదిలేసుకున్నాడు పీటర్సన్.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Michael Clarke  Kevin Pietersen  Australia  England  cricket news  

Other Articles