Virat Kohli Should Not Have Visited Girl-Friend During Rain Break

Kohli defies rules to meet anushka sharma

Kohli defies rules to meet Anushka Sharma, Virat Kohli Should Not Have Visited Girl-Friend During Rain Break, Royal Challengers Bangalore,Virat Kohli,IPL 8,Cricket IPL 8 Controversy: 'Virat Kohli Should Not Have Visited Girl-Friend During Rain BreakVirat Kohli with Anushka sharma, Virat Kohli broke protocol to Anushka, Cricket News, Sports News, Play-offs, bangalore royals challengers, latest IPL 8 news, Play-offs, IPL 8, IPL 2015, IPL, cricket news, IPL 8 MI, IPL 8 KKR, ricky ponting, IPL 8, cricket news

Virat Kohli met his girl-friend Bollywood actress Anushka Sharma during a rain break in the IPL 8 match between Royal Challengers Bangalore and Delhi Daredevils. Kohli was not the only one who broke IPL's anti-corruption guidelines, feels Dean Jones.

వివాదాస్పదంగా మారిన విరాట్-అనుష్కల కలయిక

Posted: 05/18/2015 05:42 PM IST
Kohli defies rules to meet anushka sharma

ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీస్లో టీమిండియా ఓటమికి బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మే కారణమని నెటిజెన్లు ఆడిపోసుకున్నారు. అనుష్క మ్యాచ్ చూసేందుకు వెళ్లడం వల్లే విరాట్ కోహ్లీ విఫలమయ్యాడని, టీమిండియా ఓడిపోయిందని విమర్శలు ఎక్కుపెట్టారు. నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేసి పాపం అనుష్కను ఏడిపించారు. తెలుగు అభిమానులయితే అనుష్కను ఐరన్ లెగ్ అనేశారు. అయితే వీటన్నింటినీ నిజం కాదని అమె రాకతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్లే ఆప్ వెళ్లిందని అమె లక్కీ లేడి అని కోనియాడిన కొన్ని గంటల్లోనే అసలు వివాదం తెరమీదకు వచ్చింది. విరాట్ కు అనుష్క లక్కీ యేనా కాదా అన్నది తేలనుంది.

ఐపీఎల్లో బెంగళూరు మ్యాచ్లకు వర్షం నేనున్నానంటూ ప్రత్యక్షమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 187/5 భారీ స్కోరు చేసింది. బెంగళూరు లక్ష్యసాధనకు దిగగానే భారీ వర్షం రావడంతో మ్యాచ్ రద్దయ్యింది. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చారు. ఐపీఎల్-8లో బెంగళూరు మొత్తం 16 పాయింట్లతో రెండోస్థానంలో నిలిచి నాకౌట్ చేరింది. బెంగళూరుకు ప్లే ఆఫ్ బెర్తు ఖాయంకాగానే కోహ్లీ సంతోషంతో తన ప్రేయసి అనుష్క దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. అనుష్క కూడా ముసిముసి నవ్వులతో ప్రియుడిని అభినందించింది. దీంతో అనుష్క లక్కీ లేడి అని బెంగళూరు అభిమానులు మురిసిపోతున్నారు.

ఇంతవరకు బాగానే వున్నా.. అసలు వివాదం ఇక్కడే ప్రారంభమైంది. ఐపీఎల్ నియమనిబంధనలను కాదని విరాట్ కోహ్లీ అనుష్కను కలవడానికి విఐపీ గాలరీలోకి వెళ్లడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆదివారం ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్‌ను అనుష్క డ్రెస్సింగ్ రూం పక్కనున్న వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రూంకి వచ్చిన కోహ్లీ.. వర్షం పడుతున్న సమయంలో మ్యాచ్ అగిపోయిన సందర్భంలో అనుష్క శర్మను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఇద్దరు సుమారు ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ ఆటగాడు యువరాజ్ సింగ్ వారి పక్కనే ఉన్నాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మ్యాచ్ సమయంలో తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో తప్ప మరెవరితోను క్రికెటర్లు మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు అనుష్క శర్మను పిలిపించుకొని, మాట్లాడి.. ప్రియురాలి కోసం నిబంధలను అతిక్రమించాడు విరాట్ కోహ్లీ.

దీనిపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఐపీఎల్ అవినీతి నిరోధక సెక్యూరిటీ ప్రోటోకాల్ నుంచి తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నాడు. ఈ విషయంలో ఒకవేళ తనకు పిర్యాదు అందితే విరాట్ కోహ్లీకి నోటీసులు పంపుతామని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని శుక్లా హెచ్చరించాడు. నియమనిబంధనలను ప్రతీ క్రికెటర్ పాటించాలని, లేని పక్షంలో వాటికి అర్థమేముంటుందని అయన అభిప్రాయపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Anushka sharma  IPL 8  cricket news  

Other Articles