jharkhand govt had sent notice to mahendra singh dhoni in land issue | Ipl Controversies

Jharkhand govt send notice to mahendra singh dhoni land issue

jharkhand govt, mahendra singh dhoni, land issues, housing society, ranchi controversy, land scams, govt officials, indian records

jharkhand govt send notice to mahendra singh dhoni land issue : Govt Officials mistake has made controversy in jharkhand. Mahendra singh dhoni also become a part in this issue. So that govt has sent him a notice in land issue.

ధోనీకి జార్ఖండ్ ప్రభుత్వం ‘ట్విస్టింగ్’ నోటీసులు

Posted: 05/09/2015 10:07 AM IST
Jharkhand govt send notice to mahendra singh dhoni land issue

టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి జార్ఖండ్ ప్రభుత్వం ఓ ట్విస్టింగ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ధోనీ చేసిన తప్పేమీ లేదు కానీ.. కొందరు అధికారులు చేసిన అత్యుత్సాహమే ధోనీకి నోటిసులు జారీ అయ్యేలా కారణమైంది. ‘పొరపాటున కేటాయించిన స్థలాన్ని ఎందుకు రద్దు చేయకూడదో’ తెలిపాలంటూ ఈ నోటీసు సారాంశం! ఈ నోటిసులు వచ్చిన అనంతరం ధోనీసైతం ఖంగుతినక తప్పలేదు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. దేశానికి ధోనీ చేస్తున్న సేవలకు గుర్తింపుగా రాంచీలోని ఓ హౌసింగ్ సొసైటీలో ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది. అధికారులు అత్యుత్సాహంతో ఆ స్థలం పక్కనే మరో ఖాళీజాగాను కూడా ధోనీ పేరిట రాసేశారు. అయితే.. తర్వాత తమ నాలిక్కర్చుకున్నారు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలంటే నిబంధనల ప్రకారం వెళ్లక తప్పదు కాబట్టి.. పొరపాటున కేటాయించిన ఆ స్థలాన్ని ఎందుకు వెనక్కి తీసుకోరాదో చెప్పాలని నోటిసులు పంపించిందట! ఇదీ అసలు వ్యవహారం! మరి.. దీనిపై ధోనీ ఎలా స్పందిస్తాడో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand govt  mahendra singh dhoni  land issues  

Other Articles