Mumbai Indians Won the match Against Chennai Super Kings | Mahendra Singh Dhoni | Ambati Rayudu | Hardik Pandya

Mumbai indians won against chennai super kings mahendra singh dhoni ambati rayudu hardik pandya

mumbai indians, chennai super kings, mahendra singh dhoni, hardik pandya, ambati rayudu, rohit sharma, kieron pollard, harbhajan singh, sachin tendulkar, suresh raina

Mumbai Indians Won Against Chennai Super Kings Mahendra Singh Dhoni Ambati Rayudu Hardik Pandya : Mumbai Indians consecutive won fifth match against Chennai Super Kings on friday. In this match rayudu and pandya played excellent innings.

రికార్డును చేజార్చుకున్న ధోనీ.. రాణించిన రాయుడు

Posted: 05/09/2015 10:00 AM IST
Mumbai indians won against chennai super kings mahendra singh dhoni ambati rayudu hardik pandya

రికార్డుల రారాజుగా తన పేరుపై లిఖించుకున్న ఇండియన్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్రసింగ్ ధోనీ.. ఓ అరుదైన రికార్డును తన చేజేతులా మిస్ చేసుకున్నాడు. అది కూడా తన సొంతగడ్డపైనే ఘోరంగా పరాజయం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పటివరకు తన జోరును కొనసాగించిన ధోనీ.. ప్రత్యర్థి ఆటగాళ్ల ప్రతిభ ముందు తలొగ్గక తప్పలేదు. దీంతో తన కెరీర్ లో సాధించాల్సిన మరో రికార్డును వదులుకోవాల్సి వచ్చింది.

ఐపీఎల్-8లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటినుంచి అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే! మైదానంలో పరుగుల వర్షాన్ని కురిపించే భారీ బ్యాట్స్ మెన్లు, ఆటగాళ్లను వెనువెంటనే పంపించగల సత్తా వున్న బౌలర్లు, ప్రపంచంలోనే కూలెస్ట్ కెప్టెన్ గా పేరొందిన ధోనీ.. వంటి దిగ్గజాలు ఈ జట్టులో వుండటంతో విజయాలు ఈ జట్టు వెంట పరుగులు తీస్తూ వస్తోంది. అంతేకాదు.. ఐపీఎల్ లో సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ జట్టుకే సాధ్యం! అప్పుడప్పుడు పరాజయాలు పాలయిన ఆ తర్వాతి ఇన్నింగ్స్ లో తన ప్రతాపంతో పరాజయాల ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఇలాంటి ఈ జట్టుకు ముంబై టీమ్ భారీ ఝలకిచ్చింది. అప్పటివరకు చెన్నై చేతిలో వున్న విజయాన్ని ముంబై ఒక్కసారిగా లాక్కుని అందరికీ షాక్ కు గురిచేసింది. శుక్రవారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ మీద ముంబై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. వరుసగా ఐదో విజయం సాధించడంతోపాటు రెండేళ్ల తరువాత చెపాక్ స్టేడియంలో సొంతగడ్డపై చెన్నై జట్టును ముంబై ఓడించింది. దీంతో చెన్నై జట్టు డబుల్ హ్యాట్రిక్ చేసే రికార్డును వదులుకుంది.

వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో టాపార్డర్ ఆటగాళ్లు పవెలియన్ చేరడంతో ఆ జట్టుకు పరుగులు చేయడంలో ఇబ్బంది కలిగింది. ఓపెనర్లు బ్రెండన్ మెకల్లమ్ (23), డ్వేన్ స్మిత్ (27) శుభారంభం ఇచ్చారు. కానీ ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోరుపై కన్నేసిన చెన్నె ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. పవన్ నేగి (36) మెరుపు ఇన్నింగ్స్ కి, ధోనీ (39) తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో బాధ్యయుతంగా రాణించడంతో.. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల విషయానికొస్తే.. హర్భజన్, వినయ్, మెక్ క్లెనఘన్, సుచిత్ ఒక్కో వికెట్ తో రాణించారు.

ఇక 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు.. తొలుత 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత కాస్త తడబడింది. ఈ జట్టులో భారీ స్కోరుతో రాణిస్తాడన్న రోహిత్, పొలార్డ్ (1) ఇద్దరూ వెనుదిరగడంతో జట్టు ఇబ్బందుల్లో పడిపోయింది. ఓ దశలో 2 ఓవర్లలో 32 పరుగుల లక్ష్యం చేయాల్సిన సమయం వచ్చింది. దీంతో విజయం చెన్నైదేనని అంతా భావించగా.. రాయుడు (34(19b)) ఇన్నింగ్స్ కి, హార్థిక్ పాండ్య (21(8b)) అద్భుత బ్యాటింగ్ తోడవ్వడంతో.. మరో 4 బంతులు మిగిలివుండగానే ముంబై విజయం సాధించింది. ఈ ఐపీఎల్ లో ముంబైకి వరుసగా ఐదో విజయమిది!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai indians  chennai super kings  mahendra singh dhoni  ambati rayudu  

Other Articles