Ireland clinch last over thriller against zimbamwe

Ireland versus zimbamwe, Ireland vs zimbamwe, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Ireland, Ireland CWC 2015, Live Scores, Live Updates, zimbamwe, zimbamwe CWC 2015, Sports, World Cup Live

Ireland 331 for 8 (Joyce 112, Balbirnie 97, Chatara 3-61) beat Zimbabwe 326 (Taylor 121, Williams 96, Cusack 4-32) by five runs

ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై ఐర్లాండ్ విజయం

Posted: 03/07/2015 06:31 PM IST
Ireland clinch last over thriller against zimbamwe

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా జరిగిన ఉత్కంఠకర పోరులో జింబాబ్వేపై ఇర్లాండ్ ఐదు పరుగులతో విజయాన్ని నమోదు చేసింది. 332 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వేను గెలుపుముంగిట బోర్లా పడింది. ఐ పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 49.3 బాల్స్ లో 326 పరుగులు చేసిన జింబాబ్వే.. మరో మూడు బంతులు మిగిలి వుండగానే అల్ ఔట్ అయ్యింది. మ్యాచ్ ఆత్యందం గెలుపోటములు ఇరు జట్ల మధ్య దోబుచులాడింది.

జింబాబ్వే టాప్ ఆర్డర్ విఫలం మరోమారు చెందింది. కెప్టెన్ బ్రెండన్ టేలర్ , సీన్ విలయమ్స్ ఇద్దరు చక్కని భాగస్వామ్యంతో రాణించారు. టేలర్ 121 పరుగులు సాధించగా, విలియమ్స్ 96 పరుగులు సాధించాడు. ఆ తరువాత వచ్చిన బాట్స్ మెన్లు.. క్రమంగా వెనుదిరడంతో జింబాంబ్వే.. గెలుపు ముంగిట వరకు చేరి.. బోర్లా పడింది. ఐర్లాండ్ బౌలర్లు కుసాక్ 9.3 ఓవర్లు వేసి 4 విక్కెట్లు తీసుకోగా, మూనీ, ఒబ్రియన్ చెరో రెండేసి విక్కెట్లు, డాక్కెల్, మెక్ బ్రినీ చెరో విక్కట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఎడ్ జాయీసీ శతకంతో అదరగొట్టాడు. 103 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్స్ లతో రాణించి 112పరుగులు చేశాడు. అతనితో పాటు బల్బిర్నే 97 పరుగులతో రాణించి కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు. దీంతో ఐర్లాండ్ 332 పరుగుల భారీ స్కోరు చేసింది.

వీరిద్దరూ మూడో వికెట్‌కు 138 పరుగుల భారీ స్కోరు జత చేశారు. వీరిద్దరూ ఔట్ కాగానే తరువాత వచ్చిన బాట్స్ మెన్లు అంతగా రాణించలేక పోయారు. పోర్టర్‌ఫీల్డ్ 29, స్టిర్లింగ్ 10, కెవిన్ ఒబ్రియాన్ 25, విల్సన్ 25, మూనీ 10, నెల్ ఒబ్రియాన్ 2, డాక్రెల్5(నాటౌట్), కుసాక్ 2(నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చతరా, విలియమ్స్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, పన్యగరకు ఒక వికెట్ దక్కింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Ireland  zimbamwe  

Other Articles