Vettori guptill topple afghanistan

new zealand versus afghanistan, new zealand vs afghanistan, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, afghanistan, afghanistan CWC 2015, Live Scores, Live Updates, new zealand, new zealand CWC 2015, Sports, World Cup Live

After Man-of-the-Match Vettori restricted Afghanistan to 186 with his 4 for 18, NZ (188) riding on McCullum (42) and Guptill\'s 57 went past the minnows without any hiccups.

అఫ్ఠనిస్థాన్ పై న్యూజీలాండ్ అలవోక విజయం..

Posted: 03/08/2015 02:31 PM IST
Vettori guptill topple afghanistan

ప్రపంచకప్‌లో అతిథ్య జట్టు న్యూజిలాండ్ జోరు కోనసాగించింది. కివీస్ ఖాతాలో మరో విజయం చేరింది. ఈ విజయంతో పూల్ ఏలో 10 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 23వ రోజున నేపియర్ మైదానంలో గ్రూప్ ఏలో ఆదివారం జరిగిన పోరులో పసికూన అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో కివీస్ ఆరు విక్కెట్లతో అలవోక విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్.. నిర్ధేశించిన 187 పరుగలు విజయ లక్ష్యాన్ని న్యూజీలాండ్ నాలుగు విక్కట్లను కోల్పోయి సులభంగా చేధించింది.

నిర్ణీత ఓవర్లలో మరో 13.5 ఓవర్లు మిగిలి వుండగానే లక్ష్యాన్ని సాధించి విజయాన్ని నమోదు చేసుకుంది. కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్(42; 6 ఫోర్లు, సిక్సర్) మరోసారి చెలరేగాడు. గప్టిల్(57), విలియమ్సన్(33) రాణించారు. ఇలియట్(19) రనౌటయ్యాడు. రాస్ టేలర్(24), ఆండర్సన్(7) నాటౌట్ గా నిలిచారు. ముందుగా బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్తాన్ 47.4 ఓవర్లలో186 పరుగులకు ఆలౌటైంది. నజీబుల్లా జద్రాన్(56), షెన్వారీ(54) అర్థసెంచరీలు చేశారు. అఫ్ఘనిస్థాన్ బౌలర్లలో షాపూర్ బద్రాన్, మహ్మద్ నబి చెరో వికెట్ లభించింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్థాన్.. న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు 47.4 ఓవర్లలో 186 పరుగులకే కుప్పకూలింది. షెన్వారీ, నజీబుల్లాజద్రాన్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు జావెద్ అహ్మది, ఉస్మాన్ గని మోకరిళ్లారు. దీంతో మంగళ్ కొద్దిసేపు ధీటుగానే ఎదుర్కోన్నా కేవలం 27 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. దీంతో క్రీజ్ లోకి వచ్చిన షెన్వారీ ఐదు ఫోర్లు, ఒక సిక్స్ తో 54 పరుగులతో రాణించగా, ఆ తరువాత వచ్చిన నజీబుల్లా జద్రాన్ రెండు సిక్స్ లు ఎనమిది ఫోర్లతో 56 పరుగులతో రాణించాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన హమిద్ హసన్ నాలుగు ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. వీరి మినహా ఎవ్వరూ డబుల్ డిజిట్ స్కోరును సాధించలేకపోయారు. కివీస్ బౌలర్లలో వెటోరి 4, బౌల్ట్ 3, అండర్సన్ 2, మిల్నేకు 1 విక్కెట్ లభించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  new zealand  afghanistan  

Other Articles