World cup 2015 team india practice

India's batting versus South Africa's bowling, says Kohli, AB de Villiers, Cricket, CWC 2015, Dale Steyn, David Miller, ICC World Cup 2015, India CWC 2015, Mahendra Singh Dhoni, South Africa CWC 2015, Sports, Virat Kohli, World Cup West Indies v Pakistan, WI v Pak, Pakistan v West Indies, Pak v WI, ICC Cricket World Cup 2015, World Cup 2015 ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, CWC 2015, pakistan CWC 2015, Sports, World Cup

Indian team practicing hard for sundays World Cup blockbuster at the Melbourne Cricket Ground with South Africa

బ్యాట్ ను ఝుళిపించాలి.. విజయాన్ని సాధించాలి..

Posted: 02/21/2015 06:48 PM IST
World cup 2015 team india practice

ప్రపంచ కప్ టార్నమెంటులో భాగంగా రేపు (ఆదివారం) దక్షిణాఫ్రికా జట్టుతో జరగనున్న రెండో మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితమైనదని టీమిండియా జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ కన్నా మరింత మెరుగైన ఆటతీరును ప్రదర్శించాలని టీమ్ ఇండియా సన్నధమైంది. సఫారీ జట్టులో అద్బుతంగా రాణించే బౌలర్లతో పాటు విధ్వంసకర బ్యాట్స్ మెన్ లు వున్న నేపథ్యంలో భారీ స్కోరును చేయాలన్న లక్ష్యాన్ని టీమిండియా ఆటగాళ్లు నిర్ధేశించుకున్నట్లు సమాచారం. ఒక వేళ చేసింగ్ చేయాల్సి వచ్చినా.. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా ముందునుంచి మ్యాచ్ పై పట్టుబిగించి ఎలాంటి స్కోరునైనా చేధించాలని ప్రణాళికను సిద్దం చేసుకుంది.

అత్యంత విశాలమైన మెలబోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో భారీ షాట్లు కోట్టడం అంత సులువుగా జరిగే పని కాదని భావించిన టీమిండియా జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా ఈ దిశగానే సాగించింది. భారత బ్యాట్స్‌మన్ అంతా భారీ షాట్లు ఆడటం ప్రాక్టీస్ చేశారు. సెయింట్ కిల్డాలోని జంక్షన్ ఓవల్ మైదానంలో జరిగిన సెషన్‌లో... ఒక నెట్‌ను పూర్తిగా స్పిన్నర్ల బౌలింగ్‌కు వదిలేశారు. రైనా, అక్షర్ పటేల్‌లతో బంతులు వేయించి... భారీ షాట్లు బాదారు. దక్షిణాఫ్రికా జట్టులో స్పిన్నర్ తాహిర్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని, ఎదురుదాడి చేయడం భారత మిడిలార్డర్ క్రికెటర్ల వ్యూహంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే అశ్విన్, భువనేశ్వర్ ఫిట్‌నెస్‌తో ఉన్నారని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  South Africa  India  Virat Kohli  

Other Articles