ప్రపంచకప్ క్రికెట్ టార్నమెంట్ లో భాగంగా అస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో సపారీలను.. టీమిండియా చిత్తు చేసింది. ప్రపంచ కప్ లో ఇప్పటివరకు భారత్ పై ఓటమి ఎరుగని సౌత్ ఆఫ్రికాలకు ధోణి సేన ఓటమిని రుచి చూపించి రికార్డులను తిరగరాసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ సఫారీలపై శివమెత్తి ప్రత్యర్థి బౌలర్లను మట్టికరిపించాడు. ధావన్ సెంచరీ చేసిన ప్రతీ మ్యాచ్ లోనూ టీమిండియాను విజయం వరించింది. అదే అనవాయితీ ఇవాళ కూడా కోనసాగింది.
డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ధోణిసేన అంచనాలను మించి రాణిస్తూ ఆల్ రౌండ్ షోతో అదరగొడుతోంది. టీమిండియా బౌలింగ్ అంత పటిష్టంగా లేదని విమర్శలు ఎదుర్కోంటున్న సమయంలో సఫారీలను చిత్త చేసి తమ సత్తాను చాటారు. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ధోనీసేన 130 పరుగులతో సఫారీలను చిత్తుగా ఓడించారు. ధవన్ సూపర్ సెంచరీకి తోడు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్నందించారు.
308 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 40.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటయ్యారు. అశ్విన్ మూడు, మోహిత్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో డుప్లెసిస్ (55) టాప్ స్కోరర్. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 137) ధనాధన్ ఇన్నింగ్స్తో దుమ్మురేపాడు. వన్డేలలో శిఖర్ ధావన్ తన అత్యధిక స్కోరును తిరగరాసుకున్నారు. సఫారీలపై గతంలో చేసిన 114 రన్స్ స్కోరును చెరిపేసి.. 137 పరుగులను సాధించాడు. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. భారత్ డాషిండ్ బ్యాట్స్ మెన్, వైస్ కాప్టెన్ విరాట్ కోహ్లీ కొద్దిలో హాప్ సెంచరీ మిస్ అయ్యి 46 పరుగులతో రాణించాడు. మొత్తంగా ధోణిసేన ఏడు విక్కెట్లను నష్టపోయి 307 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌటయ్యాడు. దీంతో ధవన్, కోహ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ జట్టును మెరుగై దశకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ధవన్, కోహ్లీ రెండో వికెట్కు 127 పరుగులు జోడించారు. కాగా కోహ్లీ 46 పరుగుల వద్ద ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో డుప్లెసిస్కు క్యాచిచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రహానె, కూడా పరుగుల వరద సృష్టించాడు. ఈ క్రమంలో ధవన్ సెంచరీ, రహానె హాఫ్ సెంచరీ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరును 250 మార్క్ దాటించారు. అనంతరం ధావన్ ఔటవ్వడంతో భారత్ పరుగుల వరదకు బ్రేకులు పడ్డాయి.
కాగా టిమిండియా మిడిల్ ఆర్డర్ మళ్లీ విఫలమైంది. భారత్ స్కోరును సుమారుగా 330 పరుగులు దాటిస్తుందని అభిమానులు ఆశించిన తరుణంలో సురేష్ రైనా, జెడేజా, దోణి లు విఫలమైయ్యారు. పటిష్టసాయిలో వుండి శాసిస్తున్న తరుణంలో వరస విక్కెట్లను కోల్పోయిన భారత్.. మూడు వందల పరుగులను దాటడమే కష్టమనిపించింది. అయితే ధోణి వరుసగా హ్యట్రిక్ ఫోర్లను సాధించడంతో భారత్ మూడు వందల మార్కును దాటింది. షమీ.. స్టీన్ బౌలింగ్ లో ఒక బౌండరీని సాధించడంతో భారత్ 307 పరుగులను సాధించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more