Pakistan thrashed after top order collapse record bad start in odis

West Indies v Pakistan, WI v Pak, Pakistan v West Indies, Pak v WI, ICC Cricket World Cup 2015, World Cup 2015 ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Russel, Cricket, CWC 2015, West Indies, West Indies CWC 2015, pakistan CWC 2015, Sports, World Cup

West Indies beat Pakistan – West Indies defeated Pakistan by 150 runs in the ICC World cup 2015

విండీస్ చేతిలో చిత్తైన పాక్.. నమోదైన చెత్త రికార్డు..

Posted: 02/21/2015 04:28 PM IST
Pakistan thrashed after top order collapse record bad start in odis

ప్రపంచ కప్ టార్నమెంటులో తొలిమ్యాచ్ లో భారత్ తో ఓడిన పాకిస్థాన్కు మరో పరాభవం ఎదురైంది. వెస్టిండీస్తో శనివారం జరిగిన పూల్-బి మ్యాచ్లో పాకిస్థాన్ చిత్తుగా చిత్తుగా ఓడిపోయింది. 150 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 311 పరుగుల లక్ష్యచేదనతో బరిలో దిగిన పాక్ 39 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే విండీస్ మ్యాచ్ పై పట్టుబింగించింది. పాక్ బ్యాటింగ్ కి దిగిన తొలి 10 ఓవర్లలోనే ఆ జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది.

విండీస్ బౌలర్ జెరోమ్ టేలర్ ఆరంభంలోనే పాక్ను చావు దెబ్బ తీశాడు. పాక్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలిపోవడంతో.. ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది.  పాక్ జట్టులో మఖ్సూద్ (50),  ఉమర్ అక్మల్ (59) మాత్రం రాణించారు. విండీస్ బౌలర్లు టేలర్, రసెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు చేసింది. రాందిన్ (51), సిమన్స్ (50) హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు చివర్లో ఆండ్రీ రస్సెల్ (13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.  డారెన్ బ్రావో (49 రిటైర్ట్ హర్ట్), శామ్యూల్స్ (38), సామీ (30) రాణించారు. పాకిస్థాన్ బౌలర్ హారిస్ సొహైల్ రెండు వికెట్లు తీశాడు. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన రసెల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


పాక్ పేరిట చెత్త రికార్డు..

వెస్టిండీస్తో ప్రపంచ కప్ మ్యాచ్లో పాకిస్థాన్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ ఆరంభంలో ఒక్క పరుగుకే 4 వికెట్లు కోల్పోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో 4 వికెట్ల నష్టానికి ఇదే అత్యల్ప స్కోరు (1). గత 2006లో జింబాబ్వేతో మ్యాచ్లో కెనడా 4 వికెట్ల నష్టానికి 4 పరుగులు చేసింది. తాజాగా పాకిస్థాన్.. ఇంతకంటే చెత్తగా ఆడింది. దీంతో వన్డేల్లో 4 వికెట్ల నష్టానికి అతి తక్కువ స్కోరు చేసిన జట్టుగా పాక్ అప్రతిష్ట మూటగట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pakistan  West Indies  ICC Cricket World Cup 2015  

Other Articles