Dawid warner interview on clashes with rohit sharma

rohit sharma warner clashes, rohit sharma news, warner news, rohit sharma warner latest news, rohit sharma clashes news, australia india news

dawid warner interview on clashes with rohit sharma : dawid warner feeling bad for fine after clashes with rohit sharma. He told that he just siad to rohit to talk in english while rohit speaking in hindi at that time.

‘వార్’నింగ్.. ఇంతమాత్రానికే అంతనా..?

Posted: 01/20/2015 01:46 PM IST
Dawid warner interview on clashes with rohit sharma

ముక్కోణపు సిరీస్’లో భాగంగా మెల్బోర్న్’లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ - డేవిడ్ వార్నర్’కు మధ్య జరిగిన గొడవలో వార్నర్’దే తప్పు వుందంటూ ఐసీసీ అతనికి భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే! ఓ మ్యాచ్ నుంచి నిషేధించడంతోబాటు అతని పీజులో నుంచి 50 శాతం కోత విధించింది. ఈ వ్యవహారంలో అతగాడికి తన సొంత బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)నుంచి కూడా మద్దతు లభించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వార్నర్.. గొడవ సారంశమేంటో మొత్తం వివరించాడు. తన తప్పు లేకున్నా అనవసరంగా భారీ మూల్యం విధించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

జరిగిన సంఘటనలో తన తప్పేమీ లేదని పేర్కొంటున్న ఈ కంగారూ ఆటగాడు.. ఆ సమయంలో తాను రోహిత్’ను కేవలం ఇంగ్లీష్’లో మాట్లాడమని మాత్రమే అడిగినట్లుగా వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘నిబంధనల ప్రకారం ఆ సమయంలో పరుగు తీయకూడదు. దానిపై మా ఆటగాళ్లతో వాదన జరుగుతున్న సమయంలో నేనూ అక్కడికి వెళ్లాను. అప్పుడు రోహిత్ తన మాతృభాష హిందీలో ఏదో మాట్లాడాడు. అది అర్థంకాక ఇంగ్లీష్’లో మాట్లాడమని మాత్రమే నేను చెప్పాను. అప్పుడతను ఇంగ్లీష్’లో మాట్లాడాడు. అతను ఏం చెప్పాడో నేను చెప్పలేను కానీ.. నేను జోక్యం చేసుకోకుండా వుంటే బాగుండేది’ అని స్పష్టం చేశాడు.

అయితే జరిగిన వ్యవహారంలో తనకు అంత భారీ మూల్యం విధించడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా తనపై అన్యాయంగా ఇంత జరిమానా విధించడం న్యాయంగా లేదంటూ బాధపడినట్లుగా సహచరులు తెలుపుతున్నారు. ఇంతమాత్రానికే అంతగా రియాక్ట్ అవుతారని తెలిసి వుంటే.. తానసలు జోక్యం చేసుకునేవాడు కాదని చెబుతున్నారు. అలాగే సీఏ సీఈ జేమ్స్ సదర్లాండ్ ఈ రచ్చపై మాట్లాడుతూ.. ‘నేను వార్నర్’తో మాట్లాడాను. అతను ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయలేదని చెప్పాడు’ అని చెప్పిన ఆయన.. వార్నర్’పై నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohit sharma warner clashes news  icc world cup 2015  

Other Articles