India loss third oneday match agaist englash in tri series

india england match, india vs england, india cricketers, india cricket team, worldcup 2015, india australia england tri series, england cricketers, australia cricketers, rohit sharma news, mahendra singh dhoni news, virat kohli news, suresh raina news, shikhar dhawan news

india loss third oneday match agaist englash in tri series : In tri series india has lost another match against england team which is held in brisbane.

భారత్ ఘోర వైఫల్యం.. మరోమారు పరాభావం!

Posted: 01/20/2015 05:04 PM IST
India loss third oneday match agaist englash in tri series

ముక్కోణపు వన్డే సిరీస్’లో భాగంగా భారత్-ఇంగ్లాండ్’ల మధ్య జరిగిన మ్యాచ్’లో ఇండియా ఘోరంగా వైఫల్యం పొందింది. మొన్న ఆస్ట్రేలియా చేతిలో చెత్తగా ఓడిన భారత్.. ఈసారి ఇంగ్లాండ్’తో ఘనవిజయం సాధిస్తుందని భావించిన భారతీయ అభిమానుల ఆశలపై ఒక్కసారిగా నీళ్లు చల్లేసింది. ఆ మ్యాచ్ కంటే ఈసారి అత్యంత దారుణంగా ఓడిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్’తోబాటు ప్రముఖులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. మొదటి నుంచే చెత్త ప్రదర్శనను కనబరిచింది. జట్టులో అద్భుతమైన యువ బ్యాట్స్’మెన్లు వున్నప్పటికీ.. కేవలం 153 (39.3) పరుగులకే ఆలౌటైంది. ధావన్, కోహ్లీ, రైనా, ధోనీలతో ఇతర ఆటగాళ్లు వరుసగా పవెలియన్’కి చేరడంతో భారీ స్కోరు కాదుకదా.. కనీసం 200 పరుగుల మైలురాయిని కూడా దాటించలేకపోయారు. జట్టు ఆపదలో వున్న సమయంలో తన వెరైటీ షాట్లతో ఆదుకునే ధోనీ మంత్రం కూడా ఈసారి పనిచేయలేదు. ఈ ఇన్నింగ్స్’లో బిన్నీ(44), ధోనీ(34), రహానె(33), రాయుడు(23) పరుగులు మాత్రమే చేయగలిగారు.

ఇక 154 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. బరిలోకి దిగిన ఓపెనర్లు తమ అద్భుత ప్రదర్శనతో పరుగులు చేసి జట్టును గెలుపుదిశగా రాణించడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా ఇయాన్ బెల్ 88(105), జేమ్స్ టేలర్ 56(91) స్కోరులతో రాణించి.. జట్టును గెలిపించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికొస్తే.. ఫిన్ 5 వికెట్లు తీయగా, అండర్సన్ 4, అలీ ఒక వికెట్ తీసి.. ఇండియాను ఓడించడంలో కీలకపాత్రలు పోషించారు.

ఇదిలావుండగా.. ప్రస్తుత ఇండియా బ్యాటింగ్ పెర్ ఫార్మెన్స్’ను గమనిస్తే చాలా ఘోరంగా వుందని విమర్శలు పెదవి విరుస్తున్నారు. సీనియర్ కంటే జూనియర్ ఆటగాళ్లే అద్భుతంగా రాణించగలరన్న సెలక్టర్ల నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు. పరదేశంలో ఆడిన యువఆటగాళ్లు జట్టును గెలిపించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మంచి ప్రతిభగల ఆటగాళ్లు వున్నప్పటికీ.. తమ సత్తా చాటుకోవడంలో వెనుకంజ వేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తమతోబాటు భారత్ ప్రతిష్టను దిగజార్చుతున్నారు.

అందరూ కలిసికట్టుగా కాకుండా ఎవరో ఒకరిద్దరు మాత్రమే తమదైన ప్రయత్నం చేస్తున్నారు కానీ.. మిగిలిన పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఒకవేళ ఇండియా పెర్ ఫార్మాన్స్ ఇలాగే వుంటే.. వరల్డ్ కప్’ మరెంత దారుణంగా వుంటుందోనని అంటున్నారు. కాబట్టి.. వీలైనంత త్వరగా జట్టులో మార్పులు చేయడంగానీ లేదా ఆటగాళ్లు బుద్ధి చెప్పి సరిగ్గా ఆడేలా శిక్షణ ఇప్పించాలంటూ సలహాలు ఇస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england 2015 match  icc worldcup 2015  india vs australia match  

Other Articles