West indies cricket team south africa t20 match record chasing

west indies cricket team, south africa cricket team, west indies south africa t20 match, west indies record chasing score, west indian south africa test series

west indies cricket team south africa t 20 match record chasing : the west indies team creates another record by chasing south african score 231 by 236. This is the highest chasing score ever in t20 format.

టీ-20 ఫార్మాట్’లో విండీస్ రికార్డుల మోత..

Posted: 01/12/2015 12:45 PM IST
West indies cricket team south africa t20 match record chasing

టీ-20 క్రికెట్ మ్యాచుల నేపథ్యంలో ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఏ ఇతర మ్యాచుల్లో లేనంతగా ఈ ఫార్మాట్’లో ప్రతిఒక్కరు తమ బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభను ప్రదర్శించేస్తారు. ఇక దిగ్గజ ఆటగాళ్ల విషయానికొస్తే.. ఆకాశమే హద్దుగా బంతిని మైదానం బయటపడే విధంగా షాట్స్ ఝుళిపిస్తారు. అంతెందుకు.. చివరికి బ్యాటింగ్ అంతగారాని బౌలర్లు కూడా తమ బ్యాట్’కు పనిచెబుతారు. దాదాపు నూతన ఆటగాళ్లు కూడా ఈ ఫార్మాట్ నుంచే పరిచయమవుతారు.

ఆ వ్యవహారాలు ఎలా వున్నా.. తాజాగా విండీస్ జట్టు ఈ టీ-20 ఫార్మాట్’లో సరికొత్త రికార్డును నమోదు చేసి సంచలనం రేపింది. దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్’లో ఘోరంగా విఫలమైన విండీస్ జట్టు.. టీ-20 సిరీస్’లో మాత్రం తన సత్తా చాటుతోంది. ఇదివరకే తొలిమ్యాచ్’లో ఘనవిజయం సాధించిన ఈ కరేబియన్లు.. రెండో మ్యాచ్’లో ఎవరూ ఊహించని విధంగా రికార్డు స్థాయి ఛేజింగ్ చేసి మ్యాచ్’ను వశం చేసుకున్నారు. జోహాన్నెస్ బర్గ్’లో జరిగిన ఈ మ్యాచ్’లో కరీబియన్లు పూర్తిగా తుడిచిపారేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేశారు. వీరిలో సఫారీ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ 119 పరుగులు చేయడం విశేషం. ఇక 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. మొదటి నుంచే విధ్వంసకర ప్రదర్శనను మొదలుపెట్టేసింది. ముఖ్యంగా ఓపెనర్ క్రిస్ గేల్ మరోసారి తన భయంకర ఆటను ప్రదర్శించి, సఫారీలకు చుక్కలు చూపించాడు. కేవలం 41 బంతుల్లో 90 పరుగులు (9 ఫోర్లు, 7 సిక్సులు) సాధించాడు.

ఇక మరో విండీస్ ఆటగాడు మార్లోస్ శామ్యూల్స్ (60) కూడా తన బ్యాట్ ఝుళిపిండచడంతో విండీస్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసి విజయదుందుభి మోగించింది. టీ-20 ఫార్మాట్’లో ఇదే అత్యధిక పరుగుల లక్ష్యఛేదన. దీంతో విండీస్ జట్టు మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచిపోయింది. విండీస్ ప్రదర్శించిన ఈ భయంకరమైన ఆటను చూసి సఫారీలు నల్లబడిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles