Indian origin gurinder sandhu got chance in australia team to play india australia tri series againt to india

gurinder sandhu latest news, australia - india oneday series, india cricket players, australia cricket players, india australia matches, gurinder sandhu australia team, fast bowler gurinder sandhu news

indian origin gurinder sandhu got chance in australia team to play india - australia tri series againt to india

టీమిండియాను ‘కంగారె’త్తించే పనిలో మనోడు..!

Posted: 01/12/2015 01:41 PM IST
Indian origin gurinder sandhu got chance in australia team to play india australia tri series againt to india

ఇండియా క్రికెట్ జట్టును కంగారు పెట్టించడంలో ఓ భారతీయుడు సన్నద్ధం అవుతున్నాడు. భారతీయ జట్టుకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న సదరు ఇండియన్.. తనదైన శైలిలో సమాధానం చెప్పేందుకు రెడీగా వున్నాడని సమాచారం. అతని పేరు గురీందర్ సంధు.

టీమిండియా టెస్టు సీరిస్’లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా పరాభావాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ఇప్పుడు ముక్కోణపు సిరీస్’ను ఎదుర్కోవడానికి రెడీ అవుతోంది. అయితే ఈ సిరీస్’లో భాగంగానే ఆస్ట్రేలియా జట్టులో భారత సంతతి బౌలర్ అయిన గురీందర్ సంధు చోటు సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతగాడు భారతీయ క్రికెటర్లకు తన బౌలింగ్ ప్రతిభతో సత్తా చాటుతాననే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

వచ్చేనెలలో జరగబోయే ప్రపంచకప్’లో పాల్గొనే మిచెల్ జాన్సన్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, హాజిల్ వుడ్’లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వారికి విశ్రాంతి ఇచ్చింది. దీంతో వీరి స్థానంలోనే పేసర్ గురీందర్’తోబాటు కేన్ రిచర్డ్’సన్ అనే ఆటగాడు సిరీస్’లో ఆడే ఛాన్స్ సంపాదించుకోగలిగారు. 21 ఏళ్ల సంధుకు ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్. ఒకవేళ అతగాడు ఈ సిరీస్’లో తన ప్రతిభను చాటుకుంటే.. వరల్డ్ కప్’లో చోటు దక్కే అవకాశముందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bowler gurinder sandhu  india australia oneday series  telugu sports news  

Other Articles