Bangladesh young cricketer bowler taijul islam create new history zimbabwe oneday series

taizul islam news, taizul islam history, taizul islam latest news, bangladesh vs zimbabwe oneday series, zimbabwe cricket team, bangladesh cricket team

bangladesh young cricketer bowler Taijul Islam create new history zimbabwe oneday series

తొలి మ్యాచ్’తోనే వరల్డ్ రికార్డు సృష్టించిన బౌలర్!

Posted: 12/01/2014 06:15 PM IST
Bangladesh young cricketer bowler taijul islam create new history zimbabwe oneday series

అరంగేట్రం చేసిన తొలిమ్యాచ్’తోనే బంగ్లాదేశ్’కు చెందిన యువకెరటం ప్రపంచరికార్డు సృష్టించి, సంచలనంగా మారిపోయాడు. తైజుల్ ఇస్లాం అనే లెఫ్టార్మ్ స్పిన్నర్ జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ద్వారా పరిమిత ఓవర్ల క్రికెట్లోకి అడుగుపెట్టిన అతగాడు.. తన బౌలింగ్ సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్’గా రికార్డు పుటలకెక్కాడు.

జింబాబ్వే-బంగ్లాదేశ్’ల మధ్య జరుగుతున్న ఐదువన్డేల సిరీస్’లో భాగంగా చివరి మ్యాచ్’లో ఎంట్రీ ఇచ్చిన తైజుల్.. 27వ ఓవర్ చివరి బంతికి జింబాబ్వే బ్యాట్స్ మన్ తినాషే పన్యంగరాను బౌల్డ్ చేశాడు. అలాగే తన తర్వాతి ఓవర్ తొలిబంతికి జాన్ ఎన్యుంబును, రెండో బంతికి తెందాయ్ చతారాను బౌల్డ్ చేయడంతో హ్యాట్రిక్ సాకారమైంది. ఈ తాజా ఫీట్’తో తైజుల్ బంగ్లాదేశ్ తరపున హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్ గా అవతరించాడు. అలాగే వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత నమోదు చేసినవారిలో 45వ వాడయ్యాడు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మొత్తం 7 ఓవర్లు విసిరిన ఈ యువ స్పిన్నర్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

ఈక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఆ యువఆటగాడు తైజుల్ ధాటికి కేవలం 128 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. అనంతరం 129 పరుగులు అతి తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆటగాళ్లు.. 24.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ జట్టు వన్డే సిరీస్ ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles