India vs srilanka oneday series won 3rd match hyderabad uppal stadium

india vs srilanka series 2014, india vs srilanka, shikhar dhawan, virat kohli, hyderabad uppal stadium, bowler umesh yadav, ambati rayudu, anushka sharma, ajinkya rahane, hyderabad uppal stadium

india vs srilanka oneday series won 3rd match hyderabad uppal stadium

మూడో వన్డేతో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్

Posted: 11/10/2014 11:07 AM IST
India vs srilanka oneday series won 3rd match hyderabad uppal stadium

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన భారత్-శ్రీలంక మూడో వన్డేలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇంకా ఆరుఓవర్లు మిగిలివుండగానే 6 వికెట్ల తేడాతో లంకపై ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఈ వన్డే సిరీస్ ను భారత్ ఇంకా రెండు మ్యాచులు మిగిలుండగానే సునాయాసంగా గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 242 పరుగులకే కుప్పకూలింది. అయితే జయవర్ధనె మాత్రం అద్భుతంగా ప్రదర్శించాడు. 124 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సుతో 118 పరుగులు చేశాడు. లంక ఇన్నింగ్స్ లో ఇతనిదే పైచేయి కాగా.. మిగతా ఆటగాళ్లు అతి తక్కువ స్కోరుతో పవెలియన్ చేరుకున్నారు. ఇక ఇండియా బౌలింగ్ విభానికొస్తే.. ఉమేశ్ యాదవ్ 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లతో తన సత్తా చాటుకున్నాడు. అలాగే అక్షర్ పటేల్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

ఇక 243 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన భారత్ ఆటగాళ్లు.. మొదటినుంచే లంక ఫీల్డర్లను పరుగులు పెట్టించారు. శిఖర్ ధావన్ మునుపటిలాగే తన ప్రతిభను ప్రదర్శించాను. కేవలం 79 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సుతో 91 పరుగులు నమోదు చేసుకున్నాడు. అయితే సెంచరీ చేస్తుండగానే వివాదస్పదంగా ఔటయి పవెలియన్ చేరుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 53 పరుగులు చేసి ఔటయ్యాడు. తెలుగు ఆటగాడు అయిన రాయుడు కూడా తన బ్యాటింగ్ కి బాగానే పనిచెప్పాడు. తనవంతు ప్రతిభతో ముందుకు దూసుకెళ్లిన రాయుడు... 35 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. దీంతో తెలుగు అభిమానులు కాస్తా నిరాశపడాల్సి వచ్చింది. అయితే అక్కడ జరిగిన ఘటన సందర్భంలో రాయుడు కాస్త దొరబడ్డాడని అభిమానుల బావన! ఏదైతేనేం.. చివరికి టీమిండియా మంచి విజయాన్నే సాధించడంతో స్టేడియంలో అభిమానులు ఉర్రూతలూగిపోయారు.

రాయుడు రనౌట్ (35 పరులుగు, 46 బంతుల్లో 3x4) : మూడోస్థానంలో క్రీజులోకి వచ్చిన రాయుడు.. కెప్టెన్ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా తనవంతు కృషి చేయడంలో కాస్త సఫలమయ్యాడు. క్రీజులో కుదురుకోగానే బ్యాట్ కు పనిచెప్పాడు. అయితే మంచి ఫామ్ లో కనిపించి అభిమానుల ఆశలను రెట్టింపు చేసిన రాయుడు.. అనవసరంగా రనౌట్ అయ్యాడు. మిడాఫ్ కు బంతిని తరలించిన రాయుడు అవతలి ఎండ్ వైపు పరుగెత్తగా.. ధావన్ బంతిని చూస్తూ క్రీజులోనే వుండిపోయాడు. దీంతో రాయుడికి వెనుతిరిగి వెళ్లేంత సమయం దొరకకపోవడంతో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుని పవెలియన్ వెనుదిరిగి వెళ్లిపోయాడు.

వివాదాస్పదమైన ధావన్ ఔట్ (76 బంతుల్లో 91 స్కోరు) : అర్థసెంచరీ సాధించి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ధావన్.. అంపైర్ ఇచ్చిన తప్పుడు నిర్ణయంతో వెనుదిరగాల్సి వచ్చింది. కులశేఖర బౌలింగ్ లో బంతిని ధావన్ హుక్ చేశాడు. ఆ బంతి హెల్మెట్ ను తాకుతూ కీపర్ సంగక్కర చేతుల్లో పడింది. దీంతో లంక ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయడంతో అంపైర్ దడుచుకుని ఔటిచ్చాడు. ఆ దెబ్బతో ధావన్ తోపాటు క్రికెట్ అభిమానులు షాకయ్యారు. ఏదైతేనేం... సెంచరీ చేయకుండానే ధావన్ పవెలియన్ చేరుకున్నాడు.

బౌలర్ ఉమేశ్ ఉగ్రరూపం (4/53) : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను ఉమేష్ మొదట్లోనే వారి ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఓపెనర్లుగా వచ్చిన కుశాల్ పెరీరా (4), సంగక్కర (0) ఆటగాళ్లిద్దరినీ ఉమేశ్ పవెలియన్ చేర్చాడు. అలాగే ప్రసన్నను (29), తిసార పెరీరా (1)ను ఔట్ చేసి తన బౌలింగ్ సత్తా చాటుకున్నాడు. దీంతో ఇతను నిర్ణీత 9 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs srilanka  indian cricketers  shikhar dhawan  virat kohli  ambati rayudu  

Other Articles