Indian cricket team lost t20 match with england team

indian cricket team, england vs india, t20 matches, india t20 match england, india, england matches, mahendra singh dhoni

Indian cricket team lost t20 match with england team : This time mahendra singh dhoni failed to win his team india

టీమిండియాను నిండా ముంచేసిన ధోనీ..!

Posted: 09/08/2014 10:14 AM IST
Indian cricket team lost t20 match with england team

(Image source from: Indian cricket team lost t20 match with england team)

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచుల సిరీస్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో ప్రశంసలు అందుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ... మరోసారి జట్టు పరాజయానికి కారకుడై విమర్శలను ఎదుర్కొంటున్నాడు. గెలిపిస్తాడనే నమ్మకాన్ని అందరిలో చివరిదాకా నమ్మకాన్ని కలిగించి, ఊరించిన ఈ వీరుడు... ఫైనల్ గా చేజేతులారా జట్టుని ఓడించి అందరినీ నిరాశపరిచాడు. గతంలోలాగే ఈసారి కూడా తన మ్యాచ్ ను తన ఫినిషింగ్ టచ్ తో ముగిద్దామని భావించిన ధోనీకి.. ఈసారి ఆ మంత్రం మాత్రం పనిచేయకుండా పోయింది. ప్రపంచకప్ లో టీమిండియాకు ధోనీ ఏవిధంగా ఫినిషింగ్ టచ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడో తెలిసిందే! అదే తరహాలో ఈసారి చేయాలనుకున్నప్పటికీ... అతనికి సాధ్యం కాలేదు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు తమ ఆట తీరుతో 180 పరుగులు సాధించి, ఇండియన్ బౌలర్లకు బాగానే పనిపెట్టారు. వీరిలో మోర్గాన్ ఇండియన్ ఆటగాళ్లను బాగానే పరుగులు తీయించాడు. 71 పరుగులు తీసి, ఇంగ్లాండ్ జట్టుకు అండగా నిలిచాడు. ఇక హేల్స్ కూడా 40 పరుగులతో బాగానే ఆడాడు. చివరికి ఇంగ్లాండ్ మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 180 పరుగులను సాధించింది. ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే.. షమీ ఒక్కడే 4 ఓవర్లకు గాను 38 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మోహిత్ శర్మ, కరణ్ శర్మ, జడేజాలు ఒక్కొక్కరు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఓపెనర్స్ రాగానే తమ బాదుడుతో కొద్దిసేపటివరకు బాగానే హడలెత్తించారు. ఇలా బరిలోకి దిగిన ప్రతిఒక్క బ్యాట్స్ మెన్ తమతమ ప్రతిభకు తగ్గట్టు బాగానే ప్రదర్శించారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. మొత్తం ఇన్నింగ్స్ లో ఇతనొక్కడే 66 పరుగులు చేసి, ఇంగ్లాండ్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే అతడు పవెలియన్ చేరగానే ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కోహ్లీ ఔటయిన వెంటనే రైనా, జడేజాలు కూడా పవెలియన్ చేరిపోవడంతో భారత్ శిబిరం ఒత్తిడిలో కూరుకుపోయింది. అయినప్పటికీ ఆటగాళ్లు చివరిదాకా నెగ్గుకువచ్చారు కానీ.. ధోనీ విలన్ గా నిలిచాడు.

భారత్ లక్ష్యం చివరి ఓవర్ లో 17 పరుగులు చేయాలి. భారత్ విజయం సాధిస్తుందా లేదా అంటూ అందరిలో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. క్రీజులో వున్నది ధోనీ.. లక్ష్యం ఓవర్ కి 17 పరుగులు! అందరూ ఊహించినట్లుగానే ధోనీ మొదటి బంతికే సిక్సర్ బాదేశాడు. అంతే! అభిమానులు కేకలే కేకలు! దీంతో మ్యాచ్ గెలవడం ఖాయమని అందరిలో ఆశలు చెలరేగిపోయాయి. రెండో బంతికి రెండు పరుగులు సాధించాడు. ఇక కావలసింది 4 బంతులకు 9 పరుగులు మాత్రమే. ఈ దశలో భారత్ విజయం లాంఛనమ కావాలి. అయితే మూడో బంతిని ధోనీ మింగేశాడు. సింగిల్ వచ్చే అవకాశం వున్నా.. తీయలేదు. పైగా రెండో ఎండ్ లో రాయుడు వున్నప్పటికీ.. ధోనీ సింగిల్ తీయలేదు.

ఇక నాలుగో బంతిని బౌండరీకి పంపాడు. దీంతో రెండు బంతులకు 5 పరుగులు మాత్రమే! ఏమౌతుందో.. ఏమోనంటూ అందరిలో ఉత్కంఠ! ఇక ఐదోబంతికి ధోనీ అసలుకే మింగేశాడు. సింగిల్ అవకాశం వున్నప్పటికీ రాయుడిని వెనక్కు పింపించేశాడు. లక్ష్యం 1 బాలుకు 5 పరుగులు. ఆఖరి బంతికి ఫోర్ కొడితే టై.. సిక్సర్ కొడితే విజయం. కానీ ధోని మాత్రం కేవలం ఒక్క పరుగే చేశాడు. తనపై తనకు నమ్మకమో... రాయుడు మీద అపనమ్మకమో కానీ... రెండు సింగిల్స్ వదిలేసి రిస్క్ తీసుకున్న ధోని ఇంగ్లండ్‌తో ఏకైక టి20లో భారత్‌ను చేజేతులా ఓడించాడు. ధీంతో భారత్ 3 పరుగుల తేడాతో మ్యాచ్ ను ఓడిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england t20 match  mahendra singh dhoni  indian cricket players  morgan  

Other Articles