Bcci wanted to pick sachin names to west indies india series

sachin tendulkar, indian master blaster, sachin tendulkar latest news, sachin tendulkar trophies, sachin tendulkar series, master series, west indies india series, alexander richards, west indies players, indian cricket team players, bcci, indian bcci

bcci wanted to pick sachin names to west indies india series : the indian master blaster sachin tendulkar has getting another reward by bcci. The board has take decision to put sachins name to west indies and india match series

‘‘మాస్టర్’’కి అరుదైన గౌరవం.. తర్జనభర్జనలో బీసీసీఐ!

Posted: 09/09/2014 05:30 AM IST
Bcci wanted to pick sachin names to west indies india series

ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ఆటగాళ్లలో దిగ్గజ వీరుడిగా పేరు పొందిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు త్వరలోనే ఒక అరుదైన గౌరవం దక్కనుంది. ఇప్పటికే క్రికెట్ రంగంలో వున్న అన్నిరికార్డులను తన సొంతం చేసుకుని ఢంకా బజాయించిన సచిన్.. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఒక అరుదైన గుర్తింపును సొంతం చేసుకోనున్నాడు. అయితే ఈ విషయం మీద బీసీసీఐ మాత్రం తర్జనభర్జనలో మునిగిపోయింది. సచిన్ కు దక్కుతున్న ఈ సరికొత్త గౌరవ విషయంలో ఇంకా తుదినిర్ణయాన్ని మాత్రం వెలువరించలేదు.

బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయాల ప్రకారం.. ‘‘మాస్టర్’’ సచిన్ పేరును ఏదో ఒక దేశంతో జరిగే క్రికెట్ సిరీస్ కు పెట్టి గౌరవించాలని భావిస్తోంది. ఈ నెల(సెప్టెంబర్)లోనే జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి, ఒక తుది నిర్ణయానికి వస్తారు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. సచిన్ కు సమానస్థాయి వున్న దిగ్గజాలు గల క్రికెట్ జట్లతో ఇప్పటికిప్పుడే ఏ మ్యాచ్ లు లేవు. సచిన్ తో సరితూకంగా వున్న దిగ్గజ ఆటగాడు వున్న జట్టుతో మ్యాచ్ నిర్వహించిన నేపథ్యంలోనే ఆ సిరీస్ కు సచిన్ పేరును పెట్టాలని బీసీసీఐ ఖరారు చేసింది. దీంతో ఈ విషయంలో అది కాస్త తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం!

ప్రస్తుతం అందుబాటులో వున్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే.. పాకిస్తాన్ జట్టుతో ఇండియా జట్టుకు మధ్య శత్రుత్వం పచ్చిగడ్డి మీద భగ్గుమనేంత స్థాయిలో వుంది కాబట్టి.. వారితో జరిగే సిరీస్ కు సచిన్ పేరును కేటాయించాలనుకున్నారు. అయితే పాకిస్తాన్ తో ఎప్పుడు సిరీస్ జరుగుతుందో, ఎప్పుడు జరగదో అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లో సచిన్ కు సమానస్థాయి దిగ్గజాలు లేరు. అయితే వెస్టిండీస్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటగాడిగా పేరు నమోదు చేసుకున్న రిచర్డ్స్ ఆటగాడు వుండటంతో.. త్వరలోనే ఆ జట్టుతో జరగబోయే సిరీస్ కు సచిన్ పేరును పెట్టేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో ఇంకా క్లారిఫికేషన్ మాత్రం ఇవ్వడం లేదు. కానీ.. బీసీసీఐ అంతర్గత సమాచారం ప్రకారం.. వెస్టిండీస్ తో జరిగే సిరీస్ కే సచిన్ పేరును ఖరారు చేయనున్నట్టు పక్కా సమాచారాలు వెలువడుతున్నాయి. దీంతో వచ్చే నెల(అక్టోబర్)లో ఇండియాలోనే వెస్టిండీస్ తో భారత్ ఆడే సిరీస్ కు ‘‘సచిన్ - రిచర్డ్స్’’ ట్రోఫీని ఏర్పాటు చేస్తే మేలనే ప్రతిపాదన వుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సచిన్ చివరి మ్యాచ్ ను ఆడింది కూడా వెస్టిండీస్ పైనే! దీంతో బీసీసీఐ ఈ సిరీస్ కే సచిన్ పేరును పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెలాఖరులోగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles