Kolkata punjab first qualifier postponed

Kolkata-Punjab First qualifier postponed, Indian Premier League, Kolkata Knight Riders, Kings XI Punjab, IPL 2014, ipl2014news, IPL

Unrelenting rain in Kolkata forced the first qualifier between Kolkata Knight Riders and Kings XI Punjab to be pushed to the reserve day-Wednesday.

వరుణడా... నేడైనా కరుణ చూపరా ?

Posted: 05/28/2014 09:47 AM IST
Kolkata punjab first qualifier postponed

ఐపీఎల్ ఏడవ అంచె క్యాలిఫైయింగ్ మ్యాచ్ కి వరణుడు ఏ మాత్రం సహకరించలేదు. పంజాబ్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన ఆట వాయిదా పడింది. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం నిన్న కూడా వదలకపోవడంతో పిచ్ ఆటకు సహకరించక పోవడంతో ఆటను నేటిని వాయిదా వేశారు.

నేడు రిజర్వు డే కావడంతో నిన్న జరగాల్సిన మ్యాచ్ ని నేటి సాయంత్రం నిర్వహించనున్నారు. నేడు కూడా ఆట కొనసాగే పరిస్థితి లేకపోతే ఐపీఎల్ నిబంధనల ప్రకారం కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ‘సూపర్ ఓవర్ ’ను నిర్వహిస్తారు. దీనికి కూడా మైదానం అనుకూలంగా లేకపోతే లీగ్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన పంజాబ్ (11) జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

కేవలం తొమ్మిది విజయాలు మాత్రమే సాధించిన కోల్‌కతా రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ఈ మ్యాచ్ ని చూడటానికి కొన్న టిక్కెట్లు నేడు చెల్లుతాయని, నేడు మ్యాచ్ లో ఒక్క బాల్ పడినా టిక్కెట్లు చెల్లవని నిర్వహాకులు తెలిపారు. ఈడెన్ లో కోల్ కత్తా మ్యాచ్ ని చూడాలనుకునే వారు వరణ దేవుడిని వర్షం రావద్దని కోరుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles