Chennai super kings eliminate mumbai indians

MS Dhoni, Suresh Raina, Chennai Super Kings, David Hussey, Mumbai Indians, CSK, IPL 2014

Suresh Raina smashed an unbeaten half-century as Chennai Super Kings booked a berth in the second qualifier

ముంబయిని దెబ్బకు దెబ్బ కొట్టింది

Posted: 05/29/2014 10:10 AM IST
Chennai super kings eliminate mumbai indians

డిపెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ ఎవరూ ఊహించని రీతిలో లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్ ని ఓడించి ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టి చెన్నై సూపర్ కింగ్స్ తో ఎలిమేటర్ మ్యాచ్ లో తలపడింది. గత సీజన్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నైకి ఎదురైన ఓటమికి బదులు తీర్చుకొని ముంబయిని ఇంటికి పంపించింది. బ్రబౌర్న్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి, పంజాబ్ తో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కి ధోని సేన సిద్దం అయింది.

మొదట టాస్ కోల్పోయి బ్యాటింగ్ చేసిన టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్లు సిమ్మన్స్ (44 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మైక్ హస్సీ (33 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 8 బంతులు మిగులుండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

సురేష్ రైనా అర్థ సెంచరీతో రాణించాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. డేవిడ్ హస్సీ 40, ప్లెసిస్ 35, డ్వేన్ స్మిత్ 24 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు. రైనా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అందుకున్నాడు. రెండో  క్వాలిఫయర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు  ఫైనల్లో  కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుంది.

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles