Kings xi punjab beat rajasthan royals by 16 runs

Punjab Beat Rajasthan by 16 runs, Rajasthan Royals, Kings XI Punjab, Mumbai Indians, Playoff berth

Kings XI Punjab produced a clinical all-round display to register a convincing 16-run win over Rajasthan Royals and consolidate their position at the top of the table in the IPL-7.

పంజాబ్ టాప్ లో... రాజస్థాన్ కి చావో రేవో

Posted: 05/24/2014 10:26 AM IST
Kings xi punjab beat rajasthan royals by 16 runs

ఐపీఎల్ సీజన్ - 7 లో లీగ్ దశ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. టోర్నీలో ఉన్న జట్లన్నింటికి తలో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పంజాబ్, చెన్నై, కోల్ కత్తాలు ప్లే ఆఫ్ కి అర్హత సాధించాయి. ఇక మిగిలి ఉన్న మరో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. టోర్నీ ఆరంభంలో మంచి ఫలితాల్ని సాధించి, ప్లే ఆఫ్ కి వెళ్ళడానికి పెద్ద కష్టడాల్సిన అవసరం లేదనుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు క్లిష్ట పరిస్థితి తెచ్చుకుంది.

వరుసగా మూడు ఓటములతో బెర్తును సంక్లిష్టం చేసుకుంది. ఇక ముంబై చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో నెగ్గి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. నిన్న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ 16 పరుగులతో ఓడి, ముంబైతో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. రేపు జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్ (ఆదివారం) ద్వారానే ప్లే ఆఫ్ తుది బెర్త్ ఖరారు కానుంది. పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది.

మార్ష్ (35 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), మిల్లర్ (20 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు), సాహా (20 బంతుల్లో 27; 4 ఫోర్లు), బెయిలీ (18 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), వోహ్రా (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు జత చేశారు. బెయిలీ, మిల్లర్ ఐదో వికెట్‌కు 32 బంతుల్లో అజేయంగా 60 పరుగులు జోడించడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది.

రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫాల్క్‌నర్ (13 బంతుల్లో 35 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు), హాడ్జ్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శామ్సన్ (29 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్), రహానే (26 బంతుల్లో 23; 2 ఫోర్లు) రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో రాజస్థాన్ కోలుకోలేకపోయింది. చివర్లో హాడ్జ్, ఫాల్క్‌నర్ మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles