Kolkata beat bangalore to seal ipl 7 playoffs berth

Kolkata beat Bangalore, Kolkata Knight Riders, Royal Challengers Bangalore, Eden Gardens, KKR, RCB, IPL 7

Kolkata Knight Riders continued to sizzle with Robin Uthappa and Sunil Narine playing leading roles as they booked the IPL playoff berth.

కోల్ కత్తా ప్లే ఆఫ్ కి... బెంగుళూరు ఇంటికి

Posted: 05/23/2014 11:26 AM IST
Kolkata beat bangalore to seal ipl 7 playoffs berth

ఐపీఎల్ టోర్నీలో ఎప్పుడు ఏ జట్టు రాణిస్తుందో చెప్పలేం. లీగ్ మ్యాచ్ ల్లో తొలిదశలో ఏ మాత్రం రాణించని జట్లు తరువాతి మ్యాచ్ ల్లో అద్బుతంగా రాణించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ప్లే ఆఫ్ కి చేరింది. ఆ జట్టే కోల్ కత్తా నైట్ రైడర్స్. ఈ సీజన్ లో విదేశీ గడ్డ పై జరిగిన మ్యాచ్ ల్లో ఏ మాత్రం రాణించని ఈ జట్టు స్వదేశంలో అనూహ్యంగా పుంజుకొని వరుసగా ఆరు మ్యాచ్ ల్లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్ కి అర్హత సాధించి బెంగుళూరు ఆశల పై నీళ్ళు చల్లి రాయల్ ఛాలంజర్స్ యాజమాన్యానికి తీవ్ర నిరాశను మిగిల్చింది.

గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ ను కోల్ కత్తా 30 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. తప్ప (51 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ (38 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ స్కోరు అందించారు.

ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. టకవాలె (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. నరైన్ (4/20) స్పిన్ మ్యాజిక్‌తో బెంగళూరుకు ముకుతాడు వేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఊతప్పకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles