Australia reclaim no 1 test and odi ranking

Australia No.1 Test rankings,International cricket, Australia, DubaiDomingo, Michael Clarke, Australia cricket, India cricket, South Africa cricket,

Australia returned to the No. 1 Test ranking for the first time in nearly five years.

ఆస్ట్రేలియా మళ్ళీ అగ్ర స్థానానికి

Posted: 05/02/2014 11:15 AM IST
Australia reclaim no 1 test and odi ranking

ఐదు సంవత్సరాల క్రితం వరకు క్రికెట్ లో వన్డే, టెస్టు ఫార్మాట్లలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన కంగారులు క్రమక్రమంగా తన వైభవాన్ని కోల్పోయితూ ఐసీసీ ర్యాంకుల్లో కూడా దిగజారి పోయింది. ఇన్ని సంవత్సరాల తరువాత మళ్లీ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో వన్డే, టెస్టుల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇంగ్లాండ్ పై యాషెస్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్ కి బాగా కలిసి వచ్చింది. ఆసీస్ తో (123) పాయింట్లతో దక్షిణాఫ్రికా కూడా సమానంగా ఉన్నా, దశాంశ స్థానాల ఆధారంగా కంగారూలకే మొదటి స్థానం దక్కింది.  ఇక వన్డే ర్యాంకుల్లో ఆసీస్ (115 రేటింగ్ పాయింట్లు) నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది. ఏడాది కాలంలో టెస్టుల్లో ఘోరంగా విఫలమైన భారత్  మూల్యం చెల్లించుకుంది. మూడో స్థానం నుంచి ఐదుకు దిగజారింది. అయితే వన్డే ర్యాంకుల్లో ఒక రేటింగ్ పాయింట్ కోల్పోయినప్పటికీ ధోనీసేన (112) రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. టి 20ల్లో భారత్ కే అగ్ర స్థానం దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles