Chennai crushed kolkata by 34 runs

MS Dhoni, Chennai Super Kings, Indian Premier League, Gautam Gambhir, Kolkata Knight Riders, Ravindra Jadeja,

Chennai Super Kings beat Kolkata Knight Riders by 34 runs in the first match of the Indian leg of IPL 7.

చెన్నై స్వదేశీ గడ్డ పై అదరగొట్టింది

Posted: 05/03/2014 10:38 AM IST
Chennai crushed kolkata by 34 runs

ఎడారి గడ్డ పై ఒక్క మ్యాచ్ లో తప్ప మిగతా మ్యాచ్ ల్లో అదరగొట్టిన చెన్నై జట్టు స్వదేశి గడ్డ పై ప్రారంభం అయిన రెండో దశ ఐపీఎల్ లీగ్ లో కూడా అదరగొట్టింది. ఇక ఎడారి గడ్డ పై ఏ మాత్రం రాణించని కోల్ కత్తా జట్టు అదే పరాజయాల పరంపరను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు వరుసగా ఐదు మ్యాచ్ ల్లో విజయం సాధించిన చెన్నై జట్టు, కోల్ కత్తా హ్యాట్రిక్ ఓటమిని మూట గట్టుకుంది.

ధోని సొంత గడ్డ పై జరిగిన మ్యాచ్ లో చెన్నై అన్ని రంగాల్లో రాణించి తన ఆదిపత్యం చలాయించింది. వర్షం కారణంగా మ్యాచ్ ని 17 ఓవర్లకు కుదించగా, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి, 148 పరుగలు భారీ స్కోరు సాధించింది. చెన్నై జట్టులో బ్రెండెన్ మెక్ కలమ్ (40 బంతుల్లో 56 ) మెరుపు బ్యాటింగ్ చేయగా, బౌలింగ్ లో జడేజా మరోసారి తనదైన (4-12) శైలిలో రాణించడంతో కోల్ కత్తాకు ఓటమి తప్పలేదు.

లక్ష్యాన్ని ఛేధించడానికి బరిలో దిగిన కోల్ కత్తా జట్టు ఆరంభంలో బాగానే ఆడినట్లు కనిపించినా, లక్ష్యాన్ని చేధించలేక 114 పరుగులకే పరిమితం అయ్యింది. కోల్ కత్తా ఇన్నింగ్స్ లో ఉతప్ప 38 బంతుల్లో 47, యూసుఫ్ పఠాన్ 29 బంతుల్లో 41 తప్ప మిగతా వారు ఎవ్వరూ రెండంకెల స్కోరు చేయలేదు. గంభీర్ మరోసారి విఫలం అయ్యాడు. కోల్ కత్తా పతనాన్ని శాసించిన జడేజాకు మరో సారి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు  లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles