Jadeja all round show chennai beat rajasthan

Ravindra Jadeja, Chennai Super Kings, MS Dhoni, Ashwin, Rajasthan Royals, IPL 7, IPL 2014, IPL cricket

Ravindra Jadeja produced a brilliant all-round display after Dwayne Smith fine batting show as Chennai Super Kings defended a modest total to beat Rajasthan Royals by seven runs in their IPL match here on Wednesday.

జడేజా మాయా జాలంతో చెన్నై గెలిచేసింది

Posted: 04/24/2014 10:59 AM IST
Jadeja all round show chennai beat rajasthan

ఐపీఎల్ అంటేనే ఎప్పుడు ఏ ఆటగాడు మెరుస్తాడో... ఏం అద్బుతాలు జరుగుతాయో చెప్పలేం. ఓటమి ఖాయం అనుకున్న జట్లు కూడా గెలుపు బాటలో, విజయం ఖాయం అనుకున్న జట్లు ఓటమి చవిచూస్తాయి. ఇదంతా ఐపీఎల్ మాయ. ఇక అసలు విషయానికి వస్తే.... రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అతి కష్టం మీద తక్కువ పరుగులే చేసిన చెన్నై జట్టు రవీంద్ర మాయాజాలంతో అద్బుత విజయం సాధించి వరుసగా మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

టాస్ గెలిచి చెన్నైని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. చెన్నై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు అతి కష్టం మీద 140 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (28 బంతుల్లో 50; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు వేగంతో అర్ధసెంచరీ చేయగా... చివర్లో జడేజా (33 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

రాజస్థాన్ ముంగిట పెద్ద లక్ష్యం ఏం లేదు. ఆ జట్టలో ఉన్న బ్యాట్స్ మెట్స్ చెలరేగితే చెన్నైకి ఓటమి తప్పదనుకున్నారు. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ మొదటి నుండే దూకుడుగా ఆడుతూ ఉన్నారు. కానీ రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో వాట్సన్, సామ్సన్ వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టాడు.తరువాత వచ్చిన స్మిత్ కాస్తంత దూకుడుగా ఆడినా చివరల్లో బంతి చేతిలోకి తీసుకున్న జడేజా రెండు ఓవర్లలో స్మిత్, సౌతీల వికెట్లు తీసి రాజస్థాన్ ని కోలుకోని దెబ్బ కొట్టాడు.

దీంతో 19.3 ఓవర్లలో రాజస్థాన్ 133 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తా కొట్టింది. రాజస్థాన్ జట్టులో ధావల్ కులకర్ణి (19 బంతుల్లో 28 నాటౌట్; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. భాటియా (20 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), స్మిత్ (20 బంతుల్లో 19; 1 ఫోర్) మోస్తరుగా పోరాడినా విజయం దక్కలేదు. తన స్పిన్ మాయా జాలంతో 4 వికెట్లు తీసి, విజయాన్ని అందించిన జడేజాకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ’ అవార్డు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles