Sachin tendulkar 41st birthday

Sachin Tendulkar, sachinzone, Anjali Tendulkar

The Mumbai Indians icon and Rajya Sabha MP flew in from Dubai to fulfill his duty as an Indian citizen.

మాస్టర్ సచిన్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

Posted: 04/24/2014 02:54 PM IST
Sachin tendulkar 41st birthday

రెండు దశాబ్దాల కాలం క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ క్రికెట్ నుండి వైదొలిన తరువాత నేడు తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. గత సంవత్సం అన్ని ఫార్మాట్లకు వీడ్కొలు పలికిన సచిన్ ఈసారి తన కుటుంబ సభ్యుల సమక్షంలో 42 పుట్టిన రోజు వేడుక చేసుకోనున్నాడు. క్రికెట్ లో కొనసాగినంత కాలం బిజీ షెడ్యూల్స్ కారణంగా తన సహజచరులతో కలిసి జరుపుకున్న బర్త్ డేలే ఎక్కువని చెప్పాలి.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ముంబై ఇండియన్ జట్టుకు సలహాదారుడిగా కొనసాగుతున్న సచిన్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముంబై రావడంతో కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు జరుపుకునే అవకాశం లభించింది. ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ఈయన బర్త్ డే సందర్భంగా చెన్నైకి చెందిన రుడాల్ఫ్ ఫెర్నాండేజ్ సచిన్ కి వారి కుటుంబ సభ్యులకు ఓ అరుదైన, అద్బుతమైన కానుక ఇవ్వబోతున్నాడు.

క్రికెట్ లో ఎన్నో శిఖరాలు అధిరోహించిన బ్రాడ్ మన్ గొప్పా ? సచిన్ గొప్పా ? అనే ప్రశ్నకు అనేక యోధాను యోధులు ఎన్నో విశ్లేషణ చేసినా, ఎవరికి వారే గొప్పా అనే అభిప్రాయాలు ఉన్నా, ఈయన మాత్రం బ్రామ్ మన్ కన్నా సచినే గొప్ప అనే ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని పుస్తక రూపంలో నేడు బర్త్ డే కానుకగా ‘గ్రేటర్ దాన్ బ్రాడ్ మన్ ’ పేరుతో ఇవ్వనున్నాడు.

ఈ పుస్తకం సచిన్ జీవిత చరిత్ర గురించే, విశ్లేషల గురించో, ఇంటర్వ్యూల గురించి చెప్పేది కాదు... ఫొరెనిక్స్ అధ్యయనం నా పుస్తకం. బ్రాడ్ మెన్ హోదాను ఇది సవాల్ చేస్తుంది చెప్పుకొచ్చాడు. మరి ఇంత వరకు ఎవరూ ఇవ్వని ఇలాంటి పుస్తకంలో ఏముందో, ఆయన నిరూపించిన ఆధారాలేంటో అని చాలా మంది ఆసక్తితో ఉన్నారు. సచిన్ కి మన తరుపున కూడా శుభాకాంక్షలు చెబుదామా...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles