Chris gayle going to start gangnam with yuvraj

Chris Gayle, Indian Premier League, Yuvraj Singh, Gangnam dance, Royal Challengers Bangalore, ipl2014news

Chris Gayle is confident that along with Yuvraj Singh, he can take Royal Challengers Bangalore into the final of the Indian Premier League.

యువీతో గేల్ గంగ్ నమ్ స్టెప్పులు

Posted: 04/15/2014 11:59 AM IST
Chris gayle going to start gangnam with yuvraj

క్రికెట్ అభిమానుల్ని ఎంతగానో అలరించే ఐపీఎల్ సీజన్ రేపటి నుండి ప్రారంభం కాబోతుంది. దేశ, విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు అంతా కలిసి ఆడే ఈ టోర్నీని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తారు. అలాంటి టోర్నీలో రాయల్ ఛాలంజెర్స్ బెంగుళూరు జట్టు తరుపున ఆడబోతున్న వింధ్వంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఈ టోర్నీ ఆరంభం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని, తర అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడటమనేది తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని...

భారత స్టార్ ఆటగాడు యువీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎంతోషాన్ని ఇస్తుందని, యువీతో కలిసి గ్యాంగ్నమ్ డాన్స్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతానని, తమ జట్టును ఫైనల్ కి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తానని, గత రెండు సీజన్లలో మేం ఫైనల్ కి చేరలేక పోయాం.

ఈసారి మా జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని, ఈసారి ట్రోఫీని ఎలాగైనా అందుకోవాలనుకుంటున్నామని ఆ జట్టు అధికారిక వెబ్ సైట్లో తెలిపాడు. అసలే టీ20ల్లో స్టార్ బ్యాట్స్ మెన్స్ గా పేరొందిన యువీ, గేల్ కలిస్తే గ్రౌండ్ లో పరుగుల సునామీ తప్పదేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles