Ishant sharma would have quit odis but

Cricket,Hyderabad Sunrisers,Indian Premier League,IPL 2014,IPL 7,Ishant Sharma,Sports, Sunrisers Hyderabad

Ishant reveals that a pep talk by his mother or close friends surely helps him regain his confidence when he is feeling low.

వన్డేల నుండి తప్పుకోవాలనుకున్నాడట..

Posted: 04/12/2014 12:21 PM IST
Ishant sharma would have quit odis but

భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన క్రికెట్ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. ప్రస్తుతం సర్ రైజర్స్ జట్టు తరుపున ఐపీఎల్ లో ఆడటానికి హైదరాబాదులో ఉంటున్న ఇషాంత్ మాట్లాడుతూ... తాను ఒకనొక సమయంలో జట్టులో స్థానం లభించనప్పుడు వన్డేలకు గుడ్ బై చెప్పాలనుకున్నానని, నాలో నిరాశ ఆవహించినప్పడు ఆ ఆలోచనల నుండి అమ్మ నన్ను బయట పడేసి, నాలో ఆత్మ విశ్వాసాన్ని నింపిందని చెప్పుకొచ్చారు.

ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్ జట్టులో లేకపోవడం బాధకరమే అని, జట్టులో చోటన్నది నా చేతుల్లో లేదు. నా ప్రదర్శన జట్టుకు కావాల్సినంత స్థాయిలో లేదని సెలక్టర్లు భావించినందునే నాకు స్థానం దక్కలేదని. వారి నిర్ణయాన్ని అంగీకరించానని, ప్రస్తుతం నా బౌలింగ్ ను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, కొత్త సీజన్ లో సత్తా చాటాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇప్పుడు సత్తా  చాటి మళ్ళీ భారత జట్టుకు ఎంపిక కావాలన్నదే నాముందున్న లక్ష్యమని చెప్పాడు. ఆల్ ద బెస్ట్ ఇషాంత్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles