Graeme smith announces sudden retirement

Graeme Smith retirement, South Africa vs Australia,Newlands,longest-serving captain,Graeme Smith,cape town

Smith, given control of underperforming and fiercely criticized national team at 22, went on to play over 100 Tests.

అంతర్జాతీ క్రికెట్ కి స్మిత్ గుడ్ బై

Posted: 03/04/2014 07:49 PM IST
Graeme smith announces sudden retirement

అంతర్జాతీయ సీనియర్ క్రికెట్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ ఆటగాళ్ళు క్రికెట్ నుండి వైదొలిగితే ఇఫ్పుడు మరో క్రికెట్ దిగ్గజం కూడా తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు అయిన గ్రీమ్ స్మిత్ తన క్రికెట్ కెరియర్ కి వీడ్కోలు ప్రకటించాడు.

మొన్నటికి మొన్న జాక్వెస్ కల్లీస్ టెస్టు క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గెలిచిన మ్యాచ్ ల్లో, సిరీస్ లో స్మిత్ ఆడిన ఇన్నింగ్స్ లు ఎంతో కీలకమైనవి. క్షిణాఫ్రికా జట్టును విజయాల బాటలో నడిపించి అద్భుతమైన కెప్టెన్గా ప్రశంసలు అందుకున్న స్మిత్ ఆకస్మికంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడంతో జట్టు సభ్యులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

కేప్టౌన్లో ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు ముగిసిన వెంటనే తాను క్రికెట్ నుంచి వైదొలగుతానన్నాడు. 117 మ్యాచ్లు ఆడిన స్మిత్ (33) 109 టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇది ప్రపంచ రికార్డు కూడా. స్మిత్ కెరీర్లో 27 టెస్టు సెంచరీలున్నాయి. మొత్తం 197 వన్డేలు ఆడి 37.98 సగటుతో 6989 పరుగులు చేశాడు. ఇందులో పది సెంచరీలున్నాయి. స్మిత్ లేని దక్షిణాఫ్రికా టీం ఊహించడం కాస్తంత కష్టమైన విషయమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles